Gold Price Today : షాకింగ్ న్యూస్ ...భారీగా పెరిగిన బంగారం ధరలు.. అదే బాటలో వెండి కూడా
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర కూడా ఎక్కువగా పెరిగింది
బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని మార్కెట్ నిపుణులు హెచ్చరించినట్లుగానే జరుగుతుంది. బంగారాన్ని కొనుగోలు చేయడం గగనంగా మారింది. ఇటీవల కాలంలో ధరలు కొంత తగ్గినట్లు కనిపించినప్పటికీ మళ్లీ పైపైకి ఎగబాకుతూ వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అసలు భవిష్యత్ లో బంగారాన్ని కొనగలమా? అన్న అనుమానం కూడా అనేక మందిలో బయలుదేరింది. ఇందుకు కారణం వరసగా బంగారం, వెండి ధరలు పెరుగుతుండటమే కారణం. పెరిగినప్పుడు భారీగా పెరిగి, తగ్గినప్పుడు తక్కువగా తగ్గడం బంగారానికి ఉన్న స్పెషాలిటీ. అందుకే బంగారం, వెండి జోలికి వెళితే షాక్ కొడుతుందన్న ధోరణి ఎక్కువ మందిలో కలుగుతుంది.
డిమాండ్ పెరగడంతో...
బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. రాను రాను గిరాకీ పెరగడమే తప్ప తగ్గడమంటూ జరగదు. అందుకే బంగారం ధరలు కూడా అందకుండా పోతున్నాయంటున్నారు వ్యాపారులు. బంగారం ఇక రాను రాను కొందరికే సొంతమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పరుగులు పెడుతుంది. బంగారం ధరలు తగ్గుతాయని భావించడం భ్రమే అవుతుంది. ఎప్పుడైతే బంగారం నిల్వలు తగ్గడం, డిమాండ్ పెరగడంతో వాటి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. ఏ వస్తువుకైనా అది సర్వసాధారణమే. కానీ బంగారం మాత్రం మరింత డిమాండ్ పెరగడంతోనే ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్నాయని చెబుతున్నారు.
భారీగా పెరిగిన ధరలు...
బంగారం, వెండి స్టేటస్ సింబల్ గా చూడటంతోనే డిమాండ్ అధికంగా మారింది. ప్రధానంగా దక్షిణాది ప్రాంతాల్లో పసిడి, వెండి ధరలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపేవారు ఎక్కువ కావడంతో ఇక్కడ కొనుగోళ్లు తగ్గడం లేదని చెబుతున్నా, పెరుగుతున్న ధరలు కొనుగోళ్లపై ప్రభావం చూపుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర కూడా ఎక్కువగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధరపై 750 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై నాలుగు వేల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,060 రూపాయలకు చేరుకుంది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,610 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,04,000 రూపాయలుగా ఉంది.