Gold Price Today : భారీగా పెరిగిన బంగారం ధరలు...ఇలా షాకిస్తే ఎలా సామీ?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి
బంగారం ధరలు మరింత ప్రియమవుతాయన్న వార్తలు నిజమయ్యేటట్లే కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాదికి తులం బంగారం లక్షకు చేరుకుంటుందన్న అంచనాలు నిజమయ్యేటట్లే ఉంది. ఎందుకంటే గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెండి ధరలు మాత్రం కొంత నిదానించినా మళ్లీ పెరగడం ప్రారంభించాయి. బంగారం కొనుగోలు చేయాలంటే ఇక కష్టమేనన్న అభిప్రాయం చాలా మందిలో ఇప్పటికే నెలకొంది. అదే సమయంలో ఇంకా ధరలు పెరిగితే ఇక మరింత భారంగా మారడం ఖాయమని భావించి అసలు జ్యుయలరీ దుకాణం వైపు కూడా చూసే అవకాశం లేదు. ఎందుకంటే బంగారం నిజంగా బంగారంగానే మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో...
పెళ్లిళ్ల సీజన్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. కానీ ఇప్పటి నుంచే ధరలు పెరుగుతున్నాయి. ముహూర్తాలు పెట్టుకున్న వారంతా బంగారం కొనుగోళ్లు చేయడం ప్రారంభించడంతో డిమాండ్ పెరిగింది. దీంతోనే ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. మరొక వైపు కేంద్ర బడ్జెట్ కు కూడా సమయం దగ్గర పడింది. బంగారం దిగుమతులపై కస్టమ్స్ రుసుమును పెంచుతారన్న ప్రచారమూ జరుగుతుంది. మరొకవైపు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడంవల్ల కూడా బంగారం, వెండి ధరలు పరుగు ప్రారంభించాయి. ఇలా అనేక కారణాలతో ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం ముట్టుకోవాలంటే షాక్ తగిలేలా ఉంది.
భారీగా పెరిగి...
ఇలా ధరలు పెరగడం కొత్తేమీ కాకపోయినా.. వినియోగదారులు పెరిగిన ధరలకు అలవాటు పడతారని వ్యాపారులు చెబుతున్నారు. ఎందుకంటే బంగారం అంటే భారతీయులకు పిచ్చి కాబట్టి తమ వ్యాపారానికి ఢోకా లేదంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై ఐదు వందల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై యాభై రూపాయాలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండిధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 76,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 82,700 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 93,850 రూపాయలుగా ట్రండ్ అవుతుంది.