Gold Prices Today : తగ్గేదేలే అంటున్న పసిడి ధరలు...ఆగేది లేదంటున్న వెండి ధరలు

నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి.

Update: 2024-04-11 03:43 GMT

దేశంలో బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకూ ధరలు పెరుగుతున్నాయి. స్వల్పంగా పెరిగినా బంగారం పరుగు మాత్రం ఆపలేదు. అలాగే వెండి ధరలు కూడా పైపేకే చూస్తున్నాయి. బంగారం, వెండి ధరలు నేలచూపులు చూసి చాలా రోజులు కావొచ్చింది. దీంతో కొనుగోలుదారులు బంగారం ధరలు ఇక ఏ స్థాయికి వెళుతుందన్న అంచనాలు మాత్రం ఊహకు కూడా అందడం లేదు. అలా బంగారం, వెండి రెండు వస్తువులు ధరలు పెరుగుతూ దడ పుట్టిస్తున్నాయి.

ఈ నెలలోనే...
బంగారం ఏప్రిల్ నెలలో పెరిగినంతగా మరెప్పుడూ ధరలు పెరగలేదు. మార్చి వరకూ కొంత తగ్గుతూ, మరికొంత పెరుగుతూ నిదానంగా సాగిన ప్రయాణాన్ని మాత్రం ఏప్రిల్ నెలలో మాత్రం స్పీడ్ అందుకుంది. ప్రతి రోజూ ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనేది జరగడం లేదు. పెళ్లిళ్ల సీజన్ మరో పదిహేడు రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇక మూడు నెలలు సీజన్ అనేది ఉండదు. అందుకనే ధరలు పైపైకి ఎగబాకుతున్నాయన్నది మార్కెట్ నిపుణులు చెబుతున్న మాటగా వినిపిస్తుంది.
పెరిగిన ధరలు...
నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు హెచ్చుగా మారడంతో కొనుగోలు దారులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,100 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,110 రూపాయలుగా కొనసాగుతుంది. వెండి ధరలు కిలో 89,100 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News