Gold Rates Today : ఏందిరా అయ్యా.. బంగారం ధర ఇంత పెరిగిందేంటి?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి.

Update: 2025-02-06 03:42 GMT

బంగారం ధరలు మరింత పెరుగుతాయని ఊహించింది జరుగుతున్నటే ఉంది. అది ఊహ కాదు నిజమేనని రుజువు చేస్తూ బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. బంగారం గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతుండటంతో వినియోగదారులు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే బంగారం ధరలు మండిపోతున్నాయి. పెరగడం ప్రారంభించిన పసిడి ఇక తగ్గడం లేదు. అందుకే బంగారం ధరలు పది గ్రాములు ధర 86 వేల రూపాయలకు చేరుకుంది. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. కిలో వెండి ధర దాదాపు లక్ష ఏడు వేల రూపాయలకు చేరుకోవడంతో గరిష్ట స్థాయికి చేరినట్లయింది.

ఈ ఏడాది అది సాధ్యమే...
బంగారం ధరలు వచ్చే ఏడాదికి లక్ష రూపాయలకు చేరుతాయని భావించినప్పటికీ చూస్తుంటే ఈ ఏడాది అది అధిగమించేటట్లు అర్థమవుతుంది. బంగారం ఇప్పుడు భారంగా మారింది. పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం కావడంతో బంగారం, వెండి కొనుగోలు చేయాల్సి వస్తుంది. అయితే సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు కొద్ది మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే పది గ్రాముల బంగారం ధర పదమూడు వందల రూపాయల వరకూ పెరిగింది. కిలో వెండి ధరపై 1,600 రూపాయలు పెరిగింది. ఇంత పెరుగుదల ఇటీవల కాలంలో ఇది మూడోసారి అని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో బంగారం, వెండి వస్తువుల ధరలు మరింత ప్రియమయ్యాయి.
గరిష్ట స్థాయికి...
ప్రపంచంలోనే ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి బంగారం ధరలు చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పెరగడంతో అటు వైపు చూసేందుకు కూడా వినియోగదారులు జంకుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ధరలు పెరగడంతో ఆ ప్రభావం కొనుగోళ్లపై పడనుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,060 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 86,250 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,07,100 రూపాయలకు చేరుకుంది. మధ్యాహ్నానికి ఈ ధరలు పెరగొచ్చు. తగ్గొచ్చు. లేకుంటే స్థిరంగా కొనసాగవచ్చు.


Tags:    

Similar News