Gold Price Today : హమ్మయ్య ఎన్నాళ్లెకెన్నాళ్లకు తీపికబురు... బంగారం ధరలు తగ్గాయిగా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి.

Update: 2025-01-19 03:15 GMT

బంగారం ధరల్లో పెరుగుదలకు అనేక కారణాలున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కొత్త ఏడాది ప్రారంభం నుంచి ధరలు అదుపు లేకుండా పరుగులు తీస్తూనే ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రూపాయలు దాటేసింది. కిలో వెండి లక్ష ఐదు వేల రూపాయలకు చేరువలో ఉంది. ఇంతలా ధరలు పెరగిపోవడానికి అనేక కారణాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్య, ప్రపంచంలో జరిగే అనేక పరిణామాలు, యుద్ధాలు వంటివి కూడా బంగారరం ధరల్లో హెచ్చు తగ్గుదలకు కారణాలుగా చెబుతున్నారు.

డిమాండ్ తగ్గని...
బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. డిమాండ్ తగ్గని ఏకైక వస్తువులు ఏమైనా ఉన్నాయంటే అది భూమి తర్వాత బంగారం మాత్రమే. ఏ జనరేషన్ అయినా రెండింటినీ సొంతం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మహిళలు అత్యంత ఇష్టపడే బంగారం, వెండి ధరలు ఇలా పెరుగుతూ పోతుంటే దాని ప్రభావం కొనుగోళ్లపై పడిందని చెబుతున్నారు. వ్యాపారాలు కొంత తగ్గుముఖం పట్టాయి. అంత డబ్బుపోసి బంగారం కొనుగోలు చేయడం అవసరమా? అన్న భావన అందరిలోనూ కలిగేలా ధరలు పెరుగుతున్నాయి. దీంతో వ్యాపారులు కూడా ధరలు పెరగకుండా ఉంటేనే తమ వ్యాపారం సజావుగా జరుగుతుందని భావిస్తున్నారంటే అందులో అతిశయోక్తి లేదు.
ధరలు ఇలా...
బంగారాన్ని సొంతం చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అయితే అందుబాటులో ఉంటే ధరలు అదుపులో ఉంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయడం ప్రారంభించినప్పుడే దానికి గిరాకీ మరింత పెరుగుతుందని వ్యాపారులు కూడా చెబుతున్నారు. కేవలం కొన్ని వర్గాలు వారు మాత్రమే కొనుగోలు చేయాలంటే ఎక్కువగా విక్రయాలు జరగవని చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. ఉదయం ఆరు గంటల వరకూ హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,350 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 81,110 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,04,000కు చేరుకుంది.


Tags:    

Similar News