Gold Price Today : మంగళవారం మంచి కబురు.. బంగారం ధరలు తగ్గాయోచ్

ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి

Update: 2025-01-28 03:12 GMT

బంగారం ధరలు ఇటీవల కాలంలో ఎక్కువ సార్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది ఫస్ట్ తేదీ నుంచి బంగారం పరుగులు పెడుతూనే ఉంది. దాంతో పాటు వెండి కూడా స్పీడ్ గానే పరిగెత్తుతుండటంతో ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర ఎనభై రెండు వేల రూపాయలు దాటేసింది. కిలో వెండి లక్షకు చేరువలో ఉంది. అందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ధరలు పెరగడాన్ని వినియోగదారులు తట్టుకోలేకపోతున్నారు. కొనుగోలు చేయడంపై ఆలోచనలో పడినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే అధిక ధరలను వెచ్చించి బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఒక్కరూ ముందుకు రారన్నది అందరికీ తెలిసిందే. డిజైన్లు చూసి కూడా టెంప్ట్ అవ్వడం లేదు.

క్రేజ్ తగ్గని పసిడికి...
ధరలు పెరిగినా బంగారానికి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గదన్నది వాస్తవమే. ఎందుకంటే బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి కాబట్టి అందులో నష్టాలు వచ్చే అవకాశం లేదు. అందుకే బంగారాన్ని ఎక్కువ ధర అయినా కొనుగోలు చేస్తుంటారు. కానీ అది కేవలం డబ్బులున్న వారు మాత్రమే. పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రం ధరలు విషయంలో ఆలోచిస్తారని వ్యాపారులు చెబుతున్నారు. అయితే బంగారం కొనుగోళ్లు ఎక్కువగా చేసేది పేద, మధ్యతరగతి వర్గాలే కావడంతో ఇటీవల ధరలు పెరగడంతో కొనుగోళ్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చులే అన్న ధోరణిలో ఎక్కువ మంది ఉన్నట్లు కనిపిస్తుంది.
నేటి ధరలు...
ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఒకలా ఉంటాయి. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పులుంటాయి. ధరలు పెరగవచ్చు. తగ్గవచ్చు. స్థిరంగా కొనసాగవచ్చు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఈరోజు దేశంలో్ బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 75390 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 82,240 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 96,400 రూపాయలుగా నమోదయింది. పది గ్రాముల బంగరాం ధరపై పది రూపాయలు వరకూ తగ్గిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కిలో వెండి ధరపై వంద రూపాయలు నేడు తగ్గి ఊరిస్తుంది.


Tags:    

Similar News