Gold Price Today : వారెవ్వా... ఎంతటి తియ్యటి వార్త.. ధరలు చేతికందుతున్నాయా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు ఒకరోజు పెరిగితే... మరొక రోజు తగ్గుతాయి. ధరలు పెరగడం,తగ్గడం ప్రతి రోజూ ఒక్క బంగారం విషయంలోనే సాధ్యమవుతుంది. ఉదయం ఉన్న ధరలు మధ్యాహ్నానికి మారుతుంటాయి. సాయంత్రానికి ఉన్న ధరలు ఉదయానికి ఛేంజ్ అవుతుంటాయి. అందుకే బంగారం అంటే అంతగా ఇష్టపడతారు. బంగారాన్ని కొనుగోలు చేసే వారు ఎక్కువవుతున్నారు. బంగారం నిల్వలు మాత్రం పెరగడం లేదు. దీంతో డిమాండ్ కు సరిపడా బంగారం అందుబాటులో లేకపోవడంతో సహజంగా ధరలు పెరుగుతుంటాయి. సీజన్ తో సంబంధం లేకుండా బంగారం, వెండి ధరలకు రెక్కలు వస్తుంటాయి. రెండు వస్తువులను కొనుగోలు చేయడానికి మహిళలు ఎక్కువగా పోటీ పడుతుంటారు.
అన్ని వర్గాల ప్రజలు...
ఇక బంగారం కొనుగోలు చేసేవారిలో కేవలం మహిళలే కాదు.. అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా కొనుగోలు చేయడం ప్రారంభించారు. బంగారం ఎంత ఎక్కువ ఉంటే తాము అంత సురక్షితంగా ఉంటామన్నభావన ఎక్కువగా కలగడంతో కొనుగోళ్లు గతంతో పోలిస్తే ఎక్కువగానే జరుగుతున్నాయి తప్పించి ఏమాత్రం తగ్గడం లేదు. అయితే ధరలు పెరిగినప్పుడు కొంత ఆలోచనలో పడి కొనుగోలుకు వెనకడుగు వేసినా ఆ తర్వాత మాత్రం మళ్లీ మామూలుగా మారింది. బంగారం, వెండి సెంటిమెంటల్ గా చూస్తారు. ఇక పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటంతో కొనుగోళ్లు ఎక్కువగానే జరుగుతున్నాయి. పెట్టుబడి దారులుకూడా బంగారాన్ని అధికంగా కొనుగోలు చేస్తున్నారు.
ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం, వెండిధరలు పెరగడానికి, తగ్గడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయంగా జరిగే పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి. ఈరోజు ఉదయం ఆరు గంటల వరకూ ఉన్న ధరలు మధ్యాహ్నానికి మారవచ్చు. తగ్గవచ్చు. పెరగవచ్చు. స్థిరంగా కొనసాగవచ్చు. అందుకే బంగారం ధరలుచూసి కొనుగోలు చేసే వారు ఎక్కువయ్యారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,290 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,770 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 99,400 రూపాయలుగా నమోదయింది.