Gold Price Today : గుడ్ న్యూస్ ..బంగారం ధరలు తగ్గాయి కానీ?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2025-02-08 02:53 GMT

బంగారం ధరలు తగ్గాయి. అయితే తగ్గినప్పుడు స్వల్పంగా పెరిగినప్పుడు భారీగా పెరగడం బంగారానికి అలవాటు. పెరుగుతున్న ధరలకు వినియోగదారులు కూడా నార్మల్ అయిపోతున్నారు. ధరలు పెరిగితే పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. ఇప్పుడు తగ్గినప్పుడే బంగారం ప్రియులు ఆనందం పడేపరిస్థితులు వచ్చాయి. ఎంత తగ్గిందన్నది కాదన్నయ్యా... పెరగేదన్న ఆనందమేనంటూ సంబరిపడి పోవడం వినియోగదారులకు అలవాటుగా మారింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొత్త ఏడాదిలో గోల్డ్ లవర్స్ కు ధరలు షాకిచ్చాయి. ధరలు పెరిగిన ప్రభావం కొనుగోళ్లపై స్పష్టంగా పడిందని వ్యాపారులు చెబుతున్నారు.

ధరలు పెరుగుతుండటంతో...
ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర 86 వేల రూపాయలు దాటేసింది. కిలో వెండి లక్ష ఆరు వేల రూపాయలకు పైగానే నమోదవుతుంది. ఇంత భారీగా గతంలో ఎప్పుడూ ధరలు లేవు. ఇక పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని ముందే చేస్తున్న హెచ్చరికలు నిజమవుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ వినియోగదారులను జ్యుయలరీ దుకాణాల గడప ఎక్కకుండా చేస్తున్నాయి. బంగారం అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. వెండి ధరలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. శుభకార్యాలకు కొనుగోలు చేసే వారు సయితం ఆచి తూచి కొంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో మాదిరిగా అలా వచ్చి బంగారాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదు.
కొంచెం తగ్గి...
బంగారం, వెండి ధరలు స్టేటస్ సింబల్ గా మారిన తర్వాత డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. పేద, మధ్య తరగతి ప్రజలు సయితం బంగారం కొనుగోలు వైపు మొగ్గు చూపడం, పెట్టుబడి పెట్టే వారు కూడా బంగారాన్నే ఎంచుకోవడంతో ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండిధరలు ఇలా ఉన్నాయి బంగారం ధర పై వంద రూపాయలు తగ్గింది. . 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,290 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 86,500 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,06,900 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News