Gold Rates Today : బంగారం ధరలు ఇక తగ్గుతాయా? దానికి కారణం ఇదేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది.
బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతూనే ఉన్నాయి. ఎవరికీ అందని విధంగా ధరలు ఉండటంతో కొనుగోలుకు కూడా భయపడేంతగా ధరలు పెరుగుతున్నాయి. అందుకే ఇటీవల కాలంలో కొనుగోళ్లు తగ్గాయి. బంగారం, వెండి వస్తువులకు ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. ఎందుకంటే దానిని భారతీయులు సంపదగా భావిస్తారు. కేవలం స్టేటస్ సింబల్ గా మాత్రమే కాదు సెంటిమెంట్ గా కూడా బంగారాన్ని, వెండిని చూడటం మొదలయిన తర్వాత దాని డిమాండ్ నిత్యం పెరుగుతూనే ఉంది. డిమాండ్ పెరగడం వల్లనే ధరలు కూడా అదుపు లేకుండా పరుగులు తీస్తున్నాయి. అందుకే బంగారం దుకాణాలు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి.
సీజన్ ప్రారంభమయినా...
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయినా కొనుగోళ్లు తగ్గడంపై వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఎక్కువ ధరలు పెట్టి బంగారం కొనుగోలు చేసేంత శక్తి లేకపోవడంతో వెనక్కు తగ్గుతున్నారు. బంగారం అంటే సెంటిమెంట్ ఉండే ఒకరిద్దరు మాత్రం తప్పని సరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. గత పెళ్లిళ్ల సీజన్ తో పోలిస్తే ప్రారంభంలోనే కొనుగోళ్లు తగ్గడం తమకు ఆందోళనగా ఉందని వ్యాపారులు చెబుతున్నాయి. అప్పటికీ అనేక ఆఫర్లను జ్యుయలరీ దుకాణాలు ప్రకటిస్తున్నాయి. అయినా కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. పది గ్రాముల బంగారం ధర ఎనభై రెండు వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర లక్ష నాలుగు వేల రూపాయలు పలుకుతుంది.
ధరలు తగ్గి...
అయితే బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజులుగా కొంత శాంతించాయి. పరుగు ఆపాయి. తగ్గుదల కనిపిస్తుంది. అయినా సరే ఇంకా తగ్గాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 75,090 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 81,920 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1.03,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు పెరిగే అవకాశముంది. తగ్గవచ్చు. స్థిరంగా కొనసాగవచ్చు.