Gold Rates Today : పసిడి ఇలా షాకిస్తుంటే...ఇక కొనుగోలు చేయడం కష్టమేమో?
నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడకాగానే ఉన్నాయి
బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. ఎక్కువ సార్లు ధరలు పెరుగుతూ తక్కువ సార్లు ధరలు తగ్గుతూ వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. గత కొంతకాలం నుంచి ఇదే జరుగుతుంది. రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు సయితం ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు చేసే వారిలో కొద్ది మంది కూడా ధనవంతులు మాత్రమే. అంతే తప్పించి సామాన్య, మధ్య తరగతి ప్రజలు మాత్రం బంగారం, వెండి ధరల కొనుగోళ్లను దాదాపు మానివేసినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే వారు కొనుగోలు చేయడం వల్లనే ఇన్నాళ్లు తమ దుకాణాల్లోని స్టాక్ ఎప్పటికప్పుడు అమ్ముడవుతుందని, కొన్నాళ్లుగా వారు దూరం కావడంతో స్టాక్ మిగిలిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు.
ఎన్ని ఆఫర్లు ఇచ్చినా...
జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం ఎన్ని ఆఫర్లు ప్రకటించినా బంగారం, వెండిని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర 90 వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,12 వేల రూపాయలుగా ఉంది. ఇలా ధరలు మండిపోతుంటే కొనుగోలు చేయడం అనవసరమని భావించిన పేద, మధ్యతరగతి ప్రజలు బంగారం, వెండి వైపు చూడటం మానేశారు. గోల్డ్, సిల్వర్ ధరలకు రెక్కలు వస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ జోరుగా నడుస్తుంది. రోజుకు కొన్ని వందల పెళ్లిళ్లు తెలుగు రాష్ట్రాల్లోనే జరగుతున్నాయి. అయినా బంగారం, వెండి కొనుగోళ్ల విషయాల్లో ఎలాంటి మార్పు లేదనివ్యాపారులు లబోదిబోమంటున్నారు.
నిలకడగానే నేడు...
నిన్నటి వరకూ బంగారం, వెండి స్టేటస్ సింబల్ గా ఉండేది. ఇప్పుడు అది కాస్తా కొందరికే పరిమితమయింది. పెట్టుబడి పెట్టే వారు, ధనవంతులు మినహా మిగిలిన వారు బంగారం విషయంలో కొనుగోలు దారులు ఆలోచన చేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు కొంత శాంతించాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడ్డాయి. నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడకాగానే ఉన్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 82,200 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,670 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,12,000 రూపాయలుగా నమోదయింది.