కొత్త రకం మోసం.. మీకు తెలియకుండానే అకౌంట్లు డబ్బంతా ఖాళీ

సిమ్ కార్డు.. ఇది లేకుండా ఫోన్ పని చేయదన్న విషయం అందరికి తెలిసిందే. మీరు ఎవరికైనా కాల్ చేయాలన్నా, ఇంటర్నెట్..

Update: 2023-10-26 03:58 GMT

సిమ్ కార్డు.. ఇది లేకుండా ఫోన్ పని చేయదన్న విషయం అందరికి తెలిసిందే. మీరు ఎవరికైనా కాల్ చేయాలన్నా, ఇంటర్నెట్ ఉపయోగించాలన్నా, మరేదైనా పని చేయాలన్నా సిమ్ కార్డ్ కలిగి ఉండటం తప్పనిసరి. ఎవరికైనా డబ్బులు పంపాలన్నా, ఎక్కడైనా రిజిస్టర్ చేసుకోవాలన్నా ఓటీపీ వస్తుంది కాబట్టి మొబైల్‌లో సిమ్‌ కార్డు ఉండటం తప్పనిసరి. అయితే ఈ రోజుల్లో మార్కెట్లో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. ఓటీపీ చెప్పాలనో, లేక బ్యాంకు నుంచి కాల్‌ చేస్తున్నామనో ఇలా రకరకాల మోసాలకు పాల్పడుతూ అకౌంట్లో ఉన్న డబ్బంతా ఖాళీ చేసేస్తున్నారు మోసగాళ్లు. అయితే ఈ విషయాలన్ని పక్కనబెట్టి అసలు విషయానికొద్దాం. ఇప్పుడు నేరగాళ్లు మోసం చేసేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. అదే సిమ్‌ కార్డు మార్గం. సిమ్‌ కార్డు మోసం ఏంటని అనుకుంటున్నారా..? అయితే అసలు మ్యాటర్‌లోకి వద్దాం.

మోసం చేయడానికి మోసగాళ్ళు సిమ్ మార్పిడి పద్ధతిని ఉపయోగించుకుంటున్నారు. మీకు తెలియకుండానే సిమ్‌ మార్పిడి చేసుకోవడం వల్ల లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. సిమ్ కార్డును మార్చి లక్షల రూపాయలను మోసం చేసిన ఉదంతాలు భారతదేశంలో చాలానే ఉన్నాయి. దీనిని నివారించడానికి మార్గం ఏమిటి? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం.

మోసపోయిన మహిళా లాయర్‌

నివేదికల ప్రకారం.. ఢిల్లీలోని ఒక మహిళా న్యాయవాది కూడా సిమ్ మార్పిడి ద్వారా మోసపోయింది. గుర్తు తెలియని మోసగాళ్లు టెలికం కంపెనీ నుంచి అంటూ ఆ మహిళకు మూడుసార్లు కాల్స్‌ వచ్చాయి. మరి కొంత సమయం తర్వాత ఆమె బ్యాంకు ఖాతా నుంచి లక్షల రూపాయలు డెబిట్‌ అయ్యాయి. ప్రస్తుతం పోలీసులు సైబర్‌ సెల్‌లో రిపోర్టు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

SIM కార్డ్ స్వాప్ మోసం అంటే ఏమిటి?

సిమ్ కార్డ్‌ని మార్చుకోవడం అంటే మొబైల్ సిమ్‌ని మార్చడం. మీకు తెలియకుండానే మీ సిమ్‌ని మారుస్తుంటే మీరు మోసపోవచ్చు. సిమ్ స్వాప్ మోసంలో మోసగాళ్లు మీ మొబైల్ నంబర్‌లో కొత్త సిమ్‌ను జారీ చేస్తారు. మీ పేరుతో మాట్లాడటం ద్వారా సైబర్ నేరగాళ్లు టెలికాం కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మకం కలిగించి కొత్త సిమ్‌ను జారీ చేస్తారు. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా, ఫిషింగ్ మొదలైన వాటి ద్వారా టార్గెట్ చేసిన వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. దీని తర్వాత మోసం చేసి కొత్త సిమ్‌ను పొందుతున్నారు. సిమ్ వారి చేతుల్లోకి వచ్చాక, మీ సిమ్ స్విచ్ ఆఫ్ అవుతుంది. మోసగాళ్లు అన్ని OTPలు, SMSలకు యాక్సెస్ పొందుతారు. ఈ విధంగా వ్యక్తులు మోసానికి పాల్పడుతున్నారు.

SIM స్వాప్ మోసం నుంచి రక్షించుకోవడం ఎలా?

ఇప్పుడు ఈ మోసాల నుంచి రక్షించుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం. బ్యాంకింగ్ లావాదేవీల OTPలు వారికి వస్తాయి. వాటి ద్వారా వారు మీ ఖాతాలో ఉన్న డబ్బంతా వారి ఖాతాల్లోకి వెళ్లిపోతుంది. మీరు అలాంటి మోసం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే, ఖచ్చితంగా ఈ విషయాలను గుర్తుంచుకోండి. సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దీని ద్వారా వారు మీ వివరాలను దొంగిలించి, మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే వెంటనే బ్యాంక్ అకౌంట్ పాస్‌వర్డ్ మార్చుకోండి. SMS కాకుండా బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఇమెయిల్‌ను కూడా నమోదు చేసుకోవడం మంచిది. ఏదైనా మోసం జరిగితే, వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ (https://cybercrime.gov.in/)లో ఫిర్యాదు చేయాలని పోలీసులు, టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.


Full View


Tags:    

Similar News