Gold Price Today : భారీ ఊరట.. బంగారం కొనేందుకు ఇదే మంచి టైం

బంగారం ధరలు పెరుగుతున్నాయని భావించే వారికి నిజంగా గుడ్ న్యూస్. ధరలు చాలా వరకూ అందుబాటులోకి వచ్చాయి

Update: 2025-05-13 03:31 GMT

బంగారం ధరలు పెరుగుతున్నాయని భావించే వారికి నిజంగా గుడ్ న్యూస్. ధరలు చాలా వరకూ అందుబాటులోకి వచ్చాయి. నిన్న మొన్నటి వరకూ ధరలు పెరిగి అందకుండా పోయిన బంగారం, వెండి ధరలు నేడు దిగి వస్తున్నాయి. కొనేవారు లేక డిమాండ్ పూర్తిగా తగ్గిపోవడంతో ధరలు మరింతగా దిగి వస్తున్నాయి. నిన్న ఒక్కరోజులోనే పది గ్రాముల బంగారం ధరపై పద్దెనిమిది వందల రూపాయలు తగ్గింది. ఇంత భారీగా తగ్గడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి అని వ్యాపారులు చెబుతున్నారు. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధరపై రెండు వేల రూపాయలు తగ్గింది. అయితే ఇంకా పూర్తిగా కొనుగోలు చేయడానికి అవసరమైన ధరలు రాలేదని చెబుతున్నా ఇంతకు మించి ధరలు తగ్గవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఇవే కారణం...
అమెరికా - చైనాల మధ్య ట్రేడ్ ఒప్పందం కుదరడంతో పాటు సుంకాలు తగ్గించుకోవడం, పాక్ - భారత్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం సద్దుమణగడం కూడా బంగారం, వెండి ధరలు దిగి రావడానికి కారణాలుగా చెబుతున్నారు. అందుకే అంతర్జాతీయంగా జరిగే పరిణామాలను అనుసరించి ధరల్లో మార్పులు కనిపిస్తాయంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు చాలా వరకూ తగ్గడంతో ఇక కొనుగోళ్లు కూడా ఊపందుకుంటాయని వ్యాపారులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొంత బంగారం పై సుంకాలు తగ్గించగలిగితే ఇంకా ధరలు దిగి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదని, ఇక ధరలు మరింతగా దిగి రావని కూడా వ్యాపారులు చెబుతున్నారు.
స్వల్పంగా తగ్గి...
సీజన్ అయినా సరే తమకు అవసరానికి మించి ఎవరూ బంగారాన్ని కొనుగోలు చేయడం లేదు. బంగారం పై పెట్టే పెట్టుబడిని ప్రత్యామ్నాయం వైపు పెడుతున్నారు. బంగారాన్ని కొనుగోలు చేస్త సురక్షితమైన పెట్టుబడిగా భావించే వారు కూడా నేడు కొంత ఆలోచనలో పడిపోయారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వ్పలంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండిధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 88,790 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 96.870 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,08,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Tags:    

Similar News