పీఎం కిసాన్‌ రైతులకు అలర్ట్‌.. ఈనెలాఖరులోగా ఈ పని పూర్తి చేయండి

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథఖాలను అమలు చేస్తోంది. అందులో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ఒకటి. ఈ పథకం కింద..

Update: 2023-09-11 12:38 GMT

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథఖాలను అమలు చేస్తోంది. అందులో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ఒకటి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న రైతులకు ఏడాదికి 6 వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ డబ్బులు మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున అందిస్తోంది. అయితే ఇప్పటి వరరకకు 14వ విడత డబ్బులు రైతులు అందుకున్నారు. ఇప్పుడు 15వ విడత రావాల్సి ఉంది. అయితే కొందరు రైతులకు గత విడత డబ్బులు రాలేదు. అందుకు కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం. చిన్నపాటి పొరపాటు జరిగినా మీ అకౌంట్లో డబ్బులు పడవని గుర్తించుకోవాలి. మీరు సెప్టెంబర్ 30లోపు కొన్ని ముఖ్యమైన పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది.

15వ విడత ముందు ఈ పని చేయండి

అయితే చాలా మంది రైతులు కేవైసీ చేసుకోకపోవడం కారణంగా వారికి పీఎం కిసాన్‌ డబ్బులు అందలేదు. ప్రతి ఒక్క రైతు తమ ఆధార్‌ వివరాలతో పూర్తి కేవైసీ చేసుకోవాలని సూచిస్తూ వస్తోంది. అయినా కొందరు రైతులు ఈ పని చేయకపోవడం కారణంగా వారికి డబ్బులు అందలేదు. ఇప్పుడు 15వ విడత కూడా అంతే కైవైసీ పూర్తి చేయకుంటే డబ్బులు రావని గుర్తించుకోండి. ఈనెలాఖరులోగా ఈ పని పూర్తి చేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పీఎం కిసాన్ మొబైల్ యాప్‌లోని ‘ఫేస్ అథెంటికేషన్ ఫీచర్’తో, మారుమూల ప్రాంతాల రైతులు ఇప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు OTP లేదా వేలిముద్ర లేకుండా వారి ముఖ ప్రమాణీకరణను పొందవచ్చు. మీ ఖాతాలో 14వ వాయిదా డబ్బు ఇంకా రాకపోతే, మీరు హెల్ప్‌లైన్ నంబర్ 155261 లేదా 1800115526 అలాగే 011-23381092ను ఫోన్ నంబర్ కూడా చేయవచ్చు. లేదా అధికారిక వెబ్ సైట్ ను కూడా సందర్శించి ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులకు...

ఇక ఈ పీఎం కిసాన్‌ పథకం కింద కొత్త రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధించిన 15వ విడత దరఖాస్తులు సైతం మొదలయ్యాయి. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే ఏ రైతులు మీ సేవా కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి  పని పూర్తి చేసుకోవచ్చు.
Tags:    

Similar News