చాలా మంది బిలియనీర్లు ఈ నగరంలో నివాసం.. ఏ నగరం అగ్రస్థానం

ప్రపంచంలో చాలా మంది ధనికులు ఉన్నారు. రోజురోజు వారి సంపాదన పెరిగిపోతోంది. ఇక మన దేశంలో కూడా చాలా మంది బిలియనీర్లు ఉన్నారు.

Update: 2023-11-05 15:26 GMT

ప్రపంచంలో చాలా మంది ధనికులు ఉన్నారు. రోజు వారి సంపాదన పెరిగిపోతోంది. ఇక మన దేశంలో కూడా చాలా మంది బిలియనీర్లు ఉన్నారు. వారి సంపాదను పెరిగిపోతోంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు సొంతం చేసుకుంటూ మార్కెట్లో వారి వారి వ్యాపారాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించుకుంటున్నారు. ప్రపంచంలో అత్యధిక మంది బిలియనీర్లు అమెరికాలో నివసిస్తున్నారు. గత కొన్నేళ్లుగా భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య పెరిగింది. భారతదేశంలో అనేక నగరాలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో బిలియనీర్లు నివసిస్తున్నారు. ఫోర్బ్స్ వివరాల ప్రకారం.. అత్యధిక బిలియనీర్లు ఉన్న టాప్ 10 ప్రపంచ నగరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఉన్నాయి.

దేశ ఆర్థిక రాజధాని ముంబై అగ్రస్థానంలో ఉంది. ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా, రాధాకృష్ణ దమానీ వంటి మొత్తం 33 మంది బిలియనీర్లు ముంబై నగరంలో నివసిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. సావిత్రి జిందాల్, శివ్ నాడార్ వంటి మొత్తం 20 మంది బిలియనీర్లు ఢిల్లీలో నివసిస్తున్నారు. భారతదేశ ఐటీ సిటీ బెంగళూరులో నారాయణ్ మూర్తి, అజీమ్ ప్రేమ్‌జీ సహా 10 మంది బిలియనీర్లు ఉన్నారు. గౌతమ్ అదానీ, పంకజ్ పటేల్ సహా 7 మంది బిలియనీర్లు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నివసిస్తున్నారు. ఇది కాకుండా పూణే, హైదరాబాద్‌లలో నలుగురు బిలియనీర్లు నివసిస్తున్నారు. బిలియనీర్ల జాబితాలో కోల్‌కతా ఆరో స్థానంలో ఉంది. అక్కడ ముగ్గురు బిలియనీర్లు నివసిస్తున్నారు.

Tags:    

Similar News