Land Measurement: ఎకరానికి ఎన్ని గుంటలు..? భూములను కొలిచే పద్దతులు

Land Measurement: మనం భూములు కొలవడం, రోడ్లు ఎంత పొడవు ఉన్నాయో వాటిని కొలిచేవారిని అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము.

Update: 2023-11-16 00:30 GMT

Land Measurement: మనం భూములు కొలవడం, రోడ్లు ఎంత పొడవు ఉన్నాయో వాటిని కొలిచేవారిని అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. ఎక్కువ భూములను కొలిచే విధానంలో రకరకాలుగా ఉంటాయి. కొలిచే పద్దతులు కొందరికి తెలిసినా.. చాలా మందికి తెలియకపోవచ్చు. వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా భూములను గుంటలు, ఎకరాలు, కోసు ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు. అదే ప్లాట్లను కొలిచే విధానంలో గజాలు, సెంట్లు అంటూ పిలుస్తుంటారు. అదే రోడ్లను మైలు, క్రోసు ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు. మరి వాటి అర్థాలు ఏమిటో తెలుసుకుందాం..

కొలిచే పద్దతులు:

పొడవులను కొలిచే పద్దతులు:

☛ బెత్తెడు - దాదాపు 3 అంగుళాలు

☛ జానెడు - 3 బెత్తెలు (దాదాపు 9 అంగుళాలు)

☛ అడుగు - 12 అంగుళాలు

☛ మూర - 2 జానెలు (దాదాపు 18 అంగుళాలు)

☛ గజం - 3 అడుగులు (1 మీటర్‌ కంటే తక్కువ)

☛ ఫర్లాంగు - 220 గజాలు

☛ మైలు - 8 ఫర్లాంగులు

☛ క్రోసు - 2 మైళ్లు

☛ అమడ - 8 మైళ్లు

భూములను కొలిచే పద్దతులు:

☛ ఒక గుంట - 121 చదరపు గజాలు

☛ 40 గుంటలు - ఒక ఎకరం

☛ 100 గుంటలు - ఒక హెక్టారు (2 1/2 ఎకరాలు)

☛ ఒక ఎకరం - 4840 చ .గజాలు

☛ ఒక గొలుసు - 33 ఫీట్లు

☛ 40 గొలుసులు - ఒక ఎకరం 

Tags:    

Similar News