ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారా? ఇక బాదుడే.. బాదుడు

వస్తు-సేవల పన్ను అంటే GST అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతంగా మారబోతోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్..

Update: 2023-09-30 05:04 GMT

వస్తు-సేవల పన్ను అంటే GST అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతంగా మారబోతోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా గేమింగ్ కంపెనీలకు లీగల్ నోటీసు పంపినట్లు తెలిపారు. సెప్టెంబర్ 30లోగా అన్ని రాష్ట్రాల శాసనసభలు జిఎస్‌టి సవరణ బిల్లు 2023ని ఆమోదించాలని లేదా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని సంజయ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఇది అమలులోకి వచ్చిన 6 నెలల తర్వాత ఫలితాలలను రివ్యూ చేస్తామని అయన వెల్లడించారు. ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందెం, క్యాసినోలపై 28 శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ జూలైలో ప్రకటించింది. ఆగస్టు 2న జరిగిన 51వ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం, చాలా ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు 18 శాతం GST చెల్లిస్తున్నాయి. క్యాసినోలు, బెట్టింగ్ అలాగే అవకాశంతో కూడిన ఇతర గేమ్‌లు 28 శాతం జీఎస్టీ పరిధిలో ఉంటాయి. గుర్రపు స్వారీ లేదా గుర్రపు పందేలలో, ఒక బెట్టింగ్ కు వచ్చే వాటా విలువపై ప్రభుత్వం 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తుంది. భారత్ లో ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ ఎంత ఉంటుందో ఆ లెక్కలు ఒకసారి చూద్దాం. దేశంలోని 40 కోట్ల మంది ప్రజలు ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతున్నారు. 2025 నాటికి, ఈ పరిశ్రమ విలువ 5 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 41 వేల కోట్లుగా ఉంటుందని అంచనా. దేశీయ మొబైల్ గేమింగ్ పరిశ్రమలు 2017-2020 మధ్య సంవత్సరానికి 38% చొప్పున వృద్ధి చెందాయి.
Tags:    

Similar News