డిజిట‌ల్ చెల్లింపుల్లో భార‌త్ టాప్‌: ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్‌

గత 12 సంవత్సరాలలో భారత్‌లో డిజిటల్ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

Update: 2024-03-05 03:52 GMT

RBI Governor

India Top in Digital Payments:గత 12 సంవత్సరాలలో భారత్‌లో డిజిటల్ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా సాగే మొత్తం ఆన్‌లైన్ పేమెంట్స్‌లో 49 శాతం మన భారతదేశంలోని జరుగుతున్నాయని అన్నారు. సోమవారం ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన డిజిటల్ చెల్లింపుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

2012-13లో దేశంలో 162 కోట్ల రిటైల్ చెల్లింపులు డిజిటల్ పేమెంట్స్ అయితే, 2023-24 నాటికి 14,726 కోట్లకు పెరిగింది. అంటే గత 12 ఏళ్లలో డిజిటల్ పేమెంట్స్ సుమారు 90 రెట్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్త డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు 49 శాతం భారత్‌లోనే సాగుతున్నాయి` అని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. యూపీఐ.. భారత్‌లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన పేమెంట్స్ సిస్టమ్‌గా మారిందన్నారు.

గణనీయమైన వృద్ధి

కాగా, దేశీయంగా డిజిటల్ చెల్లింపుల్లో గణనీయమైన వృద్ధి నమోదు చేయడంలో యూపీఐదే కీలక పాత్ర అని గవర్నర్‌ అన్నారు. గత ఏడాదిలో జరిగిన ఆన్ లైన్ పేమెంట్స్‌లో 80 శాతం దీని ద్వారానేనని అన్నారు. ఇక 2017లో 43 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగగా, 2023 నాటికి అది 11,761 కోట్లకు పెరిగినట్లు వెల్లడించారు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పేమెంట్స్, బీమా ప్రీమియం చెల్లింపులు, మ్యూచువల్ ఫండ్ పేమెంట్స్, ఈ-కామర్స్ లావాదేవీలకు ఎక్కువ మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లిస్తున్నారని గవర్నర్‌ అన్నారు.

Tags:    

Similar News