Gold Rate Today : బంగారం కొనుగోలు చేసే వారికి షాకింగ్ న్యూస్

బంగారం కొనుగోలు చేసే వారికి షాకింగ్ న్యూస్. ఒక్కరోజులోనే బంగారం ధర భారీగా పెరిగింది

Update: 2025-11-13 07:35 GMT

బంగారం కొనుగోలు చేసే వారికి షాకింగ్ న్యూస్. ఒక్కరోజులోనే బంగారం ధర భారీగా పెరిగింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ పెరగనంతగా ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బంగారం, వెండి ధరలు ఈరోజు ఉదయం 9 గంటల తర్వాత భారీగా పెరగడంతో ధరల్లో చాలా తేడా కనిపిస్తుంది. దీంతో కొనుగోలు చేయాలనుకున్న వారు ఆందోళన చెందుతున్నారు.

ఒక్కరోజులోనే భారీగా...
ఈరోజు మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులువచ్చాయి. పది గ్రాముల బంగారం ధరపై 2,290 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై తొమ్మిది వేల రూపాయలు పెరిగింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,17,150 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,27,800 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,82,000 రూపాయలకు చేరకుంది. ధరలు పెరుగుదలతో కొనుగోలు దారులు వెనక్కుతగ్గుతున్నారు.


Tags:    

Similar News