Gold Price Today : రికార్డులను తిరగరాస్తున్న బంగారం.. హిస్టరీ క్రియేట్ చేస్తున్న వెండి
బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు నిజమవుతున్నాయి.
బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు నిజమవుతున్నాయి. కేవలం బంగారం మాత్రమే కాదు.. ఇప్పుడు బంగారం కంటే వెండి మరింత ఖరీదుగా మారిపోయింది. బంగారాన్ని, వెండిని కొనుగోలు చేయడం చాలా కష్టమైన పని. ఇంకా ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ధరల పెరుగుదల ఇంతటితో ఆగదని, పరుగులు పెడతాయని అంటున్నారు. ధరల పెరుగుదలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆకాశమే హద్దుగా బంగారం, వెండి ధరలు దూసుకు పోతున్నాయి. అయితే ఏ స్థాయిలో ధరలు పెరుగుతాయన్నది అంచనాలకు కూడా అందడం లేదు.
ఈ స్థాయిలో ధరలు...
బంగారం, వెండి ధరల పెరుగుదల సాధారణమే అయినప్పటికీ ఈ స్థాయిలో ధరలను పెరగడం గతంలో ఎన్నడూ చూడలేదని వ్యాపారులు సయితం అంటున్నారు. అదే సమయంలో ధరలు పెరుగుతున్నప్పటికీ అంతర్జాతీయంగా బంగారం, వెండికి డిమాండ్ పెరుగుతుంది. కొనుగోళ్లు కేవలం కొన్ని వర్గాలకే పరిమితమయినప్పటికీ బంగారంపై పెట్టుబడి సురక్షితమని భావించి ఎక్కువ మంది బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. ఏ మాత్రం ఆర్థిక స్థితి తమకు సహకరించినా వేరే వైపు చూడటం లేదు. బంగారం, వెండి మార్కెట్ లో భారీగా పెరుగుదల ఉండటంతో దానిపై పెట్టుబడి పెట్టి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చని భావించి ఎగబడుతున్నారు.
ఈరోజు కూడా...
ఇక పెళ్లిళ్లు సీజన్ తో పాటు దీపావళి పండగ కూడా వస్తుండటంతో బంగారం ధరలు మరింత ఎగబాకుతాయంటున్నారు. ధన్ తెరాస్ కూడా ఈ నెలలో ఉండటంతో బంగారం కొనుగోళ్లు కూడా ఎక్కువగా ఉంటున్నాయన్న అంచనాలున్నాయి. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,18,660 రపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,29,450 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 2,07,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు మరింత పెరగొచ్చు. తగ్గొచ్చు. స్థిరంగా కొనసాగవచ్చు.