Gold Price Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇంతగా ధరలు ఎన్నడూ తగ్గలేదుగా
ఈరోజు దేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి
బంగారం ధరలు తగ్గుతాయన్న వార్తలు అందరినీ ఊరిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి భారీగా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలోనూ, వివిధ మాధ్యమాల ద్వారా బంగారం భారీగా పతనమవుతుందని వస్తున్న ప్రచారంతో కొనుగోలు చేయకుండా చాలా మంది వేచి చూస్తున్నారు. బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. ఎందుకంటే బంగారం, వెండి ఆభరణాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడానికి మహిళలు ఎక్కువగా ఉత్సాహం చూపుతారు. అదే సమయంలో పురుషులు కూడా పెట్టుబడిగా చూస్తూ వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.
కొనుగోలు చేయాలంటే...
బంగారం అనేది ఒక లోహం. అయితే దానిని దిగుమతి చేసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ముందుంటాయి. అందులో భారతదేశం కూడా ఒకటి. భారత్ లో బంగారం, వెండి కొనుగోళ్లు, విక్రయాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అదే సమయంలో ఇతర దేశాల్లో మాదిరగా గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేసే సంస్కృతి భారత్ లో లేదు. కేవలం బంగారం, వెండి ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేస్తుంటారు. ఇక అనేక కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతుంటాయి. అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, అమెరికా విధించిన అదనపు సుంకాలు ధరలపై ప్రభావం చూపుతాయి.
భారీగా తగ్గి...
పెళ్లిళ్లు, పండగ సీజన్ నడుస్తుండటంతో బంగారం, వెండి వస్తువుల కొనుగోళ్లు ఆశించిన రీతిలో జరగడం లేదు. ధరలు తగ్గుతాయని పెట్టుబడి పెట్టే వారు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై ఆరు వందల రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై మూడు వేల రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,13,900 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,24,260 రూపాయలకుగా నమోదయింది. కిలో వెండి ధర 1,73,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు జరిగే అవకాశముంది