Gold Price Today : బ్యాడ్ లక్.. బంగారం ధరల పరుగు మళ్లీ ఊపందుకున్నట్లేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
బంగారం ధర మరింత పెరుగుతుందన్న అంచనాలు నిజమవుతాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది మాదిరిగానే వచ్చే ఏడాది కూడా భారీగా బంగారం, వెండి ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. అనేక కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర 1.25 లక్షల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి 1,70 లక్షలకు చేరుకుంది. ఇంకా పెరిగితే పది గ్రాముల బంగారం ధర లక్షన్నర రూపాయలకు చేరుకునే అవకాశముంటుందని, అదే కిలో వెండి ధర మాత్రం రెండు లక్షలకు మళ్లీ చేరుకునే అవకాశముందని అంచనాలు వినపడుతున్నాయి. కొనుగోలు చేసే వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచనలు వెలువడుతున్నాయి.
విభిన్నంగా అంచనాలు..
బంగారం ధరలు మండిపోతుండంతో దాని ప్రభావం కొనుగోళ్లపై పడింది. బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడానికి వెనకా ముందూ ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే బంగారం ధరలు మరింత పెరుగుతాయని అంచనాలు ఒకవైపు వినపడుతున్నప్పటికీ మరొకవైపు ధరలు పతనమవుతాయన్న ప్రచారం కూడా జోరుగా జరగడమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అందుకే అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, ట్రంప్ విధించిన అదనపు సుంకాలు, దిగుమతులు తగ్గడం వంటి కారణాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపనున్నాయి.
ధరలు పెరిగి...
ఈ ఏడాది తొలి రోజు నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వచ్చే ఏడాది కూడా ఇదే పరుగు కంటిన్యూ అవుతుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో పెట్టుబడి దారులు కూడా ఒకింత కొనుగోలుకు ఆలోచనలో పడ్డారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,14,960 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,25,410 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,72,900 రూపాయలుగా కొనసాగుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు రావచ్చు.