Gold Rates Today : గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు దూసుకుపోతున్న వెండి ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
బంగారం ధరలు మరింత ప్రియమవుతాయన్న హెచ్చరికలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. బంగారానికి ఉన్న డిమాండ్ మరే వస్తువుకు ప్రపంచంలో లేదు. ఎందుకంటే బంగారానికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. ధరలతో సంబంధం లేకుండా, డిమాండ్ తో నిమిత్తం లేకుండా అమ్ముడు పోయే ఏకైక వస్తువు బంగారం మాత్రమే. అయితే గత కొద్ది నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో కొంత వినియోగదారులు, పెట్టుబడి పెట్టేవారు సయితం ఆలోచనలో పడ్డారు. ఇంత భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోతాయేమోన్న ఆందోళనతోనే వెనక్కు తగ్గారు కానీ కొనుగోలు చేయకూడదన్న ఆలోచనతో మాత్రం కాదన్నది వాస్తవం.
ఇష్టపడే వస్తువు...
బంగారం అనేది మహిళలకు మక్కువైన వస్తువు అయితే.. పురుషులు సురక్షితమైన పెట్టుబడిగా భావించడంతోనే ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. బంగారం, వెండి అనేది మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమై పోయింది. పండగలు, పుట్టినరోజులు, శుభకార్యాలకు ఖచ్చితంగా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రపంచంలో ఉన్న బంగారం నిల్వలు అధికంగా భారతదేశంలోని మహిళల వద్దనే అధికంగా ఉన్నాయన్న అంచనాలు కూడా వినిపిస్తాయి. ఎందుకంటే తరతరాల నుంచి కొనుగోలు చేస్తుండటంతో పాటు బంగారం కొనుగోలు ఆశకు ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడదన్నది కూడా అంతే నిజం.
నేటి ధరలు...
ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగే సీజన్ లో బంగారం ధరలు మరింత పెరుగుతాయి. వెండి ధరలు కూడా భారీగా పెరిగి కొనుగోలు దారులకు దాదాపు దూరమయ్యాయి. అందుకే పెరిగిన ధరల ప్రభావం కొనుగోళ్లపై పడింది. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,11,840 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,22,010 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,64,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు జరిగే అవకాశముందని అంటున్నారు. ఈ ధరలకు తోడు దుకాణాల యజమానులు వివిధ రూపాల్లో విధించే పన్నులు అధికంగా ఉంటాయి.