Gold and Silver Rates Today: బంగారం అమ్మకాలు ఇంత దారుణంగా పడిపోయాయా?
బంగారం ధరలు భారీగా పతనమయవుతాయన్న ప్రచారం జోరుగా జరుగుతుంది.
బంగారం ధరలు భారీగా పతనమయవుతాయన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. కొన్ని నెలల్లో బంగారం ధరలు బాగా పడిపోతాయని అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో కొనుగోలు చేసే వారు, పెట్టుబడి పెట్టేవారు కొంత వెనకడుగు వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ బంగారం విషయంలో కొన్ని దశాబ్దాల చరిత్ర చూసుకుంటే ఒక్కసారి పెరిగిన బంగారం ధరలు భారీగా దిగివచ్చే అవకాశం లేదని కూడా అనుకోవాలి. ఎందుకంటే ఏడాదికేడాది బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. 2000 సంవత్సరం నాటికి నేటి బంగారం ధరలకు అసలు పొంతనే లేదు. వేల రూపాయలు తేడా ఉంది. దీన్నిబట్టి ఒక్కసారి పెరిగిన బంగారం ధరలు ఇక తగ్గే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ధరలు తగ్గుతాయన్న ప్రచారంతో...
బంగారం అనేది భారత దేశ సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం. ఎందుకంటే శుభకార్యం, పండగలు, పెళ్లిళ్లు జరిగినప్పటికీ ఖచ్చితంగా అందులో బంగారానికి చోటు ఉంటుంది. శుభకార్యాలలో పండితులు ఎంత ముఖ్యమో .. బంగారం కూడా అంతే ముఖ్యంగా మారింది. గత కొన్ని దశాబ్దాలుగా సంప్రదాయంగా వస్తుండటంతో అధిక మొత్తంలో తమకున్న శక్తి మేరకు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. దక్షిణ భారత దేశంలో బంగారం క్రయ విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రాంతాల్లో బంగారం అమ్మకాలు ఎక్కువగా ఉండటంతో అక్కడ జ్యుయలరీ దుకాణాలు కూడా ఎక్కువగా వెలిశాయి. కొనుగోళ్లు అత్యధికంగా జరిగే ప్రాంతాలుగా గుర్తించి అక్కడ తమ శాఖలను నెలకొల్పుతున్నారు.
నేటి ధరలు...
కానీ గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పతనమవుతాయన్న ప్రచారం ఊపందుకోవడంతో కొనుగోళ్లపై ఆ ప్రభావం పడింది. ఇప్పుడు అత్యధిక ధరను కొనుగోలు చేస్తే ధరలు తగ్గితే నష్టం వాటిల్లే అవకాశముందని భావించి పెట్టుబడి దారులు కూడా జంకుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,13,390 రూపాయల వరకూ ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,23,700 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,84,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పులుండవచ్చు.