Gold Rates Today : బంగారం ఇక కొనడం కష్టమే.. ధరలను చూస్తే షాకవ్వాల్సిందే
ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది
బంగారం ధరలు ఇక ఆగేట్లు లేవు. పెరగడం ప్రారంభించిన తర్వాత ఇక తగ్గడం అనేది బంగారం విషయంలో జరగదు. జరిగినా అప్పుడప్పుడు అరుదుగా జరుగుతుంటుంది. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏ రోజు బంగారం కొనుగోలు చేయాలని వెళితే దుకాణానికి వెళ్లే సమయానికి ధరలు భయపెడుతున్నాయి. ఉదయం ఉన్న ధరలు మధ్యాహ్నానికి ఉండటం లేదు. మధ్యాహ్నం ఉన్న ధరలు ఉదయానికి మరింత వేగంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి విషయంలో ఇదే జరుగుతుంది. ఈ ఏడాది ఆరంభం నుంచి మొదలయిన బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతున్నాయి.
పెరుగుతాయని...
బంగారం ధరలు మరింత పెరుగుతాయని ఎప్పటి నుంచో అంచనాలు వినపడుతున్నాయి. ధరలు తగ్గుతాయని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కానీ ధరలు మాత్రం పైపైకి వెళుతున్నాయి. ధరలు ఇంతగా పెరుగుతుండటంతో కొనుగోళ్లు ఎక్కువగా జరగడం లేదు. పెరుగుతున్న ధరల ప్రభావం కొనుగోళ్లపై ఎక్కువగా చూపుతుందంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ప్రభావంతో పాటు విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, ట్రంప్ విధించిన సుంకాలు, ట్రంప్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఎక్కువగా చూపతుంది. బంగారం ధరల దిగుమతులు కూడా తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణమని అంటున్నాు.
మళ్లీ ధరలు పెరిగి...
అందులోనూ పండగలు, పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో ధరలు పెరుగుతున్నాయి. పెట్టుబడులు పెట్టే వారు సయితం బంగారం పై పెట్టడానికి భయపడిపోతున్నారు. ఎందుకంటే బంగారం విషయంలో ఎవరి అంచనాలు అందడం లేదు. ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు మాత్రమే పెరిగింది. ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,17,910 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,28,660 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,83,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు మళ్లీ పెరగవచ్చు.