Gold Price Today : షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో భారీ పెరుగుదల కనిపించింది

Update: 2025-11-11 04:17 GMT

బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి. ఎన్నడూ లేనంతగా ధరలు మండిపోతున్నాయి. తగ్గినట్లే తగ్గి తిరిగి పెరగడం ప్రారంభించాయి. గతంలో బంగారం ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ధరలు అస్సలు కొనుగోలు చేసేందుకు కూడా వీలు లేదు. ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు కూడా ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో బంగారం, వెండి ధరలు మరింత ప్రియమవుతాయని ఎప్పటి నుంచో అంచనాలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకూ ధరలు తగ్గుతాయని చెబుతున్న అంచనాలు మాత్రం నిజం కావడం లేదు. బంగారం ధరలు నిత్యం పెరుగుతూనే ఉండటంతో కొనుగోలు దారులకు పసిడిపై ఆసక్తి కూడా పోతుంది.

బంగారం కొనాలంటే...?
బంగారం కొనుగోలు చేయాలంటే మామూలు విషయం కాదు. లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరగడంతో బంగారానికే ఉన్న సొమ్మును ఊడ్చేసి పెట్టడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. బంగారం, వెండి ధరలు తగ్గుతాయని భావించిన వారికి ప్రతిరోజూ నిరాశ ఎదురవుతుంది. వెండి ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ నిర్ణయాలు, ట్రంప్ విధించిన అదనపు సుంకాలతో ధరలు తగ్గడం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
భారీగా పెరిగి...
అయితే ఇదే సమయంలో బంగారం కొనుగోలు చేసేందుకు కొందరు మాత్రమే ముందుకు వస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతుండటంతో కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడి పెట్టేవారు మాత్రం కొనుగోలు చేయడం లేదు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో భారీ పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 1100 రూపాయలు పెరిగింది. వెండి కిలో ధరపై 2,500 రూపాయలు పెరిగింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం 1, 11, 950 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 23, 220 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర1, 67, 000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి మళ్లీ ధరలు పెరిగే అవకాశముంది.




Tags:    

Similar News