Gold Rates Today : అందుబాటులోకి వచ్చేవరకు ఆగుతారా? ఇప్పుడే బంగారాన్ని కొనుగోలు చేస్తారా?
దేశంలో బంగారం, వెండి దరలు నేడు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి
పసిడి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధరలు తగ్గుతాయని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఊగిసలాట మధ్య బంగారం కొనుగోళ్లు పెద్దగా జరగడం లేదు. ధరలు తగ్గిన సమయంలో కొనుగోలు చేయవచ్చని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటికీ బంగారం ధరలు అందుబాటులోకి రాకపోవడంతో ధరలు తగ్గుతాయేమోనని ఎదురు చూస్తున్నారు. కానీ వినియోగదారులు ఆశించిన స్థాయిలో తగ్గడం అనేది జరగదని చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం బంగారం, వెండి ధరలు మోస్తరుగా ఉన్నాయని, ఇంకా ధరలు తగ్గుతాయని భావించి కొనుగోలు చేయకుండా ఆగిపోతే ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు.
అనుకున్న స్థాయిలో...
బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఆశించినంత స్థాయిలో తగ్గకపోవడంతో కొనుగోలు దారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బంగారం, వెండి ఇప్పుడు అత్యంత విలువైన వస్తువులుగా మారాయి. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ధరలను బట్టి భారత్ లోనూ వాటి ధరలు మారుతుంటాయి. డాలర్ మారకపు విలువ కూడా బంగారం, వెండి వస్తువుల ధరల్లో మార్పుపై ప్రభావం చూపుతుంది. దీనికితోడు భారత్ లో జ్యుయలరీ దుకాణాలు విధించి అదనపు పన్నులు, సుంకాలు కూడా వెరసి బంగారం, వెండి వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో ఒకే ధర ఉండకపోవడానికి ఇదే కారణమని అందరూ చెబుతున్నదే.
నేటి ధరలు ఇలా...
ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నడుస్తుండటంతో బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లు పెరుగుతాయని జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం భావిస్తుంది. అనేక ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఉదయం ఆరు గంటలకు నమోదయిన ధరల వివరాల ప్రకారం.. హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,11,750 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,23,780 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,50,954 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉండే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.