Gold Rates Todday : ఎంత గుడ్ న్యూస్... భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీగా తగ్గుదల కనిపించింది

Update: 2025-11-05 03:28 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయి. అది అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకూ కొన్ని దశాబ్దాల నుంచి చూస్తున్న వారికి ఇది కొత్త అనిపించదు. బంగారం, వెండి వస్తువులకు ఉన్న గిరాకీతో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం అసాధారణంగా ధరలు పెరగడంతోనే అసలు చర్చ జరుగుతోంది. క్రమంగా ధరలు పెరిగితే పెద్దగా బాధ ఉండదు. కానీ ఒక్కసారిగా వేలల్లో ధరలు పెరిగి లక్షల రూపాయలకు ధరలు చేరుకోవడంతో కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే బంగారం, వెండి కంటే అందుకు ప్రత్యామ్నాయం వైపునకు కొనుగోలుదారరులు అలవాటు పడిపోయారు.

పదకొండు నెలల నుంచి...
గత పదకొండు నెలల నుంచి బంగారానికి ప్రత్యామ్నాయానికి అలవాటు పడిపోయిన కొనుగోలు దారులు బంగారం కొనుగోలు చేయడం కంటే వేరే ఇతర వస్తువులపై పెట్టుబడి పెట్టడం మంచిదని భావిస్తున్నారు. మరొకవైపు డాలర్ పడుతున్న నేపథ్యంలో బంగారం ధరలు దిగి వస్తాయని మరికొందరు అంచనా వేస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండి వస్తువుల కొనుగోలు పట్ల ఆసక్తి చూపుతుంటారు. భారత్ లో ఎక్కువగా బంగారం, వెండి ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేస్తారు. గోల్డ్ బాండ్స్ ను కానీ, బిస్కెట్లను కాని కొనుగోలు చేయడానికి ఎవరూ అంతగా ఉత్సాహం చూపరు.
భారీగా తగ్గి...
అందులో పెళ్లిళ్లు, శుభకార్యాలు నడుస్తుండటంతో బంగారానికి గిరాకీ మరింత పెరుగుతుంది. పెట్టుబడి దారులు కూడా ధరలు మరింత పతనమవుతాయేమోనని ఎదురు చూస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై ఎనిమిది వందల రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై 3,200 రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,12,240 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,22,450 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,64,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశముంది.


Tags:    

Similar News