Gold Price Today : బంగారం ధరలు తగ్గుతాయని ఎదురు చూసేవారికి నిరాశ.. మళ్లీ పెరిగాయ్

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది

Update: 2025-11-04 03:31 GMT

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. ఇంకా తగ్గుతాయని వెయిట్ చేయడం శుద్ధ దండగ. మనకు తగ్గాయని అనిపించినప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయడం ఉత్తమం. ఎందుకంటే బంగారం, వెండి ధరలలో మార్పు ఎవరి చేతులో ఉండదు. అందుకు అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అమెరికా విధించిన అదనపు సుంకాలు వంటి విషయాలు బంగారం, వెండి ఆభరణాల ధరలపై ప్రభావం చూపుతాయి. దీనికి తోడు పన్నులు, తయారీ ఛార్జీలను అదనంగా వసూలు చేస్తుంటారు.

సెంటిమెంట్ కావడంతో...
డాలర్ బలహీనపడినా బంగారం ధర పెరుగుతుంది. అలాగే డిమాండ్ ఎక్కువగా ఉన్న బంగారం ధరలు అదుపులో ఉండవు. ఇక సీజన్ లో కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ధరలను అదుపు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండి ఆభరణాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే అందరూ ఆభరణాలను కొనుగోలు చేయరు. విదేశాల్లో ఎక్కువ మంది బంగారం, వెండి ఆభరణాలకంటే బాండ్స్ ను కొనుగోలు చేస్తుంటారు. ఇక భారత్ లో దిగుమతులు తగ్గుతున్నా బంగారం, వెండి ఆభరణాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. అనేక కారణాలతో ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
నేటి ధరలు...
ఇక పెట్టుబడి దారులు ఎక్కువ మంది ధరలు ఇంకా తగ్గుతాయేమోనని ఎదురు చూస్తున్నారు. బంగారం, వెండి వస్తువులు సెంటిమెంట్ తో ముడిపడి ఉండటంతో భారత్ లోనే ఎక్కువగా కొనుగోళ్లు జరుగుతుంటాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,12,910 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,23,180 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,68,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు ఉండవచ్చు.


Tags:    

Similar News