Gold Rates Today : దీపావళి రోజున షాకిచ్చిన బంగారం ధరలు

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

Update: 2025-10-20 03:28 GMT

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వెండి ధరలు తగ్గుతున్నట్లు అనిపించినా ఇంకా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి రాలేదు. బంగారం ధరలు కూడా అంతే. ఎవరికీ అందుబాటులో లేని విధంగా బంగారం, వెండి ధరలున్నాయి. ఇటీవల కొంత ధరలు తగ్గినట్లు ఊరించినప్పటికీ మళ్లీ పెరుగుతూ షాకులిస్తున్నాయి. అంతే కాదు.. ధరలు దిగి వస్తాయని ఎదురు చూసిన వారికి దీపావళి రోజు కూడా నిరాశ ఎదురయింది. ఎందుకంటే ఈరోజు కూడా బంగారం, వెండి ధరలు పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. ధరలు పెరుగుదల చూస్తుంటే ఈ ఏడాదిలోనే పది గ్రాముల బంగారం ధర లక్షన్నర దాటే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి.

భారత్ లోనే ఎక్కువగా...
బంగారం, వెండి అంటే సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా భారత్ లో బంగారం, వెండి వస్తువులకున్న డిమాండ్ మరే వస్తువుకు ఉండదు. మహిళలు అత్యంత ఇష్టపడే బంగారం, వెండి వస్తువులకు డిమాండ్ భారత్ లో ఎప్పుడూ తగ్గదు. అలాంటి బంగారం, వెండి వస్తువుల ధరలు గత కొద్ది నెలలుగా పెరుగుతుండటంతో కొనుగోలు చేయాలనుకున్నవారు సయితం వెనక్కు తగ్గుతున్నారు. ఉన్న డబ్బంతా బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ మంది ఇష్టపడటం లేదు. అయితే కొందరు మాత్రం తక్కువ సమయంలో లాభాలు వస్తాయని భావించి బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తూ ధరలు పెరిగిన తర్వాత విక్రయించవచ్చన్న ఉద్దేశ్యంలో ఉన్నారు.
నేటి ధరలు ఇలా...
అందుకే జ్యుయలరీ దుకాణాలకు కొంత రద్దీ పెరిగింది. దీపావళి పండగతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటంతో బంగారు దుకాణాలు కొంత కళకళలాడుతున్నాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే కొనుగోళ్లు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,19,940 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,30,850 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,89,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.



Tags:    

Similar News