Gold Price Today : రికార్డులను బ్రేక్ చేస్తున్న గోల్డ్.. షేక్ చేస్తున్న సిల్వర్

ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది.

Update: 2025-10-18 03:16 GMT

బంగారం ధరలు మండిపోతున్నాయి. పట్టుకుంటే కాలిపోతుంది. బంగారం, వెండి వస్తువుల కొనుగోలు ఇక సామాన్య ప్రజలకు సాధ్యం అయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పటికే పెరిగిన ధరలతో ఒకింత ఆందోళనకు గురవుతున్న పసిడిప్రియులు ధరలు మరింత పెరిగే అవకాశముండటంతో ఇక ఆగవని, అందుకు అనేక కారణాలున్నప్పటికీ తమకు అందుబాటులో ఉండవన్న నిర్ణయానికి మధ్యతరగతి, వేతన జీవులు వచ్చేశారు. అందుకే బంగారానికి ఇప్పటికే దూరమయిన ఈ వర్గాలు ఇక ప్రత్యామ్నాయం వైపు చూడాల్సి వస్తుంది. వన్ గోల్డ్ గ్రామ్ ఆభరణలను ధరించి మహిళలు కూడా సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు ఇప్పటికే నెలకొన్నాయి. రాను రాను ధరలు మరింత పెరిగే అవకాశముంది.

అంతర్జాతీయంగా...
బంగారం ధరల పెరుగుదలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. అంతర్జాతీయంగా ఇదే పరిస్థితి నెలకొంది. బంగారం పై గతంలో పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం ఈ ధరలు సంతోషాన్నిస్తున్నాయి. ఇంతలా ధరలు పెరుగుతాయని వారు కూడా ఊహించలేదు. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరగడంతో బంగారం, వెండి వస్తువులు గతంలో కొనుగోలు చేసిన వారు ఇక చాలులే ఈ జీవితానికి అనుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. భవిష్యత్ లో బంగారం కొనుగోలు చేసే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. పెళ్ళిళ్లు, శుభకార్యాలకు కూడా బంగారం, వెండి వినియోగించడం కూడా రానున్న కాలంలో బాగా తగ్గిపోతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అంత ధరలు పెట్టి కొనుగోలు చేయలేని పరిస్థితి ఇందుకు కారణం.
భారీగా పెరుగుతూ...
పండగలు, శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ తో బంగారం, వెండి ధరలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు సయితం అంచనాలు వేస్తున్నారు. మదుపరులు కూడా బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది. పెరిగాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,21,710 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,29,450 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 2,02,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News