Gold Price Today : గుడ్ న్యూస్.. బంగారం కొనుగోలుకు ఇదే సరైన సమయం

ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి

Update: 2025-11-25 03:29 GMT

బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు నిజం కావడం లేదు. క్రమంగా ధరలు దిగి వస్తున్నాయి. గత కొద్ది రోజలుగా బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. కొనుగోలు చేసే వారు లేకపోవడంతో ధరలు దిగి రాక తప్పడం లేదు. డిమాండ్ పడిపోవడంతో ధరలు క్రమంగా దిగివస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది తాత్కాలికం మాత్రమేనని ధరలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయని, బంగారం కావాల్సిన వాళ్లు కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. 2026 నాటికి ధరలు మరింత హెచ్చుగా ఉంటాయని హింట్ ఇస్తున్నారు.

ఈ ఏడాది మాత్రం...
2025 సంవత్సరం మాత్రం బంగారం ప్రియులకు బ్యాడ్ ఇయర్ అని మాత్రమే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభమయిన బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధర లక్షన్నర రూపాయలకు చేరువలోకి వెళుతుందని అంచనాలు వినిపించినా అది జరగలేదు. ఇక కిలో వెండి ధర రెండు లక్షల రూపాయలు దాటేసి తిరిగి ధరలు బాగా పతనమయ్యాయి. అందుకే ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అందుకే ఏ మాత్రం ఆర్థిక స్థోమత ఉన్నా వెంటనే బంగారం, వెండి కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
నేటి ధరలు ఇలా...
పెళ్లిళ్లు, శుభకార్యాలు నడుస్తుండటంతో బంగారం, వెండి ధరలు కొంత తగ్గడంతో క్రమంగా కొనుగోళ్లు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పెట్టుబడి దారులు సయితం ముందుకు వచ్చి కొనుగోలు చేస్తున్నారంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 460 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వెయ్యి రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,14,690 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,25,120 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,70,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News