Gold Price Today : గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గుతున్నాయ్
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న హెచ్చరికలతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. బంగారాన్ని, వెండిని ఇక జీవితంలో కొనుగోలు చేయగలమా? లేదా? అన్న భయం కూడా వారిలో ఉంది. ఎందుకంటే ఎన్నడూ లేనంతగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఈ ధరల పెరుగుదల ప్రభావం కొనుగోళ్లపై భారీగానే పడింది. గత ఏడాది సమయంలో పెరిగిన ధరలు మరెన్నడూ పెరగలేదని వ్యాపారులు సయితం చెబుతున్నారు. అయితే ధరలు పెరిగినా కొన్ని విషయాల్లో మాత్రం కొనుగోలు చేయకతప్పదు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగరాం, వెండి వస్తువులను కొనుగోలు చేయాల్సి రావడంతో కొంత అమ్మకాలు జరుగుతున్నప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం జరగడం లేదు.
కొనుగోళ్లపై పడి...
ధరలు పెరుగుతున్న కొద్దీ కొనుగోళ్లు తగ్గడం సహజమే. అయితే కొనుగోళ్లలో స్తబ్దత నెలకొనడం కొంత కాలమేనని, అందువల్ల రానున్న కాలంలో ధరలు తగ్గుతాయన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. బంగారం ధరలు మరింతగా పెరగడానికి, తగ్గడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ తో రూపాయి తగ్గుదల, ట్రంప్ విధించిన సుంకాలు, ట్రంప్ అమెరికా అధ్యక్షుడయిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. కానీ ధరలు ఇంకా తగ్గుతాయన్న అంచనాలు కూడా వినిపిస్తుండటంతో చాలా మంది కొనుగోలు చేయకుండా వేచి చూస్తున్నారు.
నేటి ధరలు...
ప్రధానంగా ఈ సీజన్ లో కొనుగోళ్లు విపరీతంగా జరగాల్సి ఉంది. అసలు బంగారం విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మకాలు నిలిచిపోయాయని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. అయితే ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,14,640 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,25,070 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,74,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు జరగవచ్చు.