Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... నేటి ధరలు ఇలా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల లేదు
బంగారం ధరలు ఒకరోజు పెరుగుతూ, మరొకరోజు తగ్గుతున్నాయి. అయితే బంగారం, వెండి ధరలు మాత్రం ఇంకా ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ధరలు ఇంకా మధ్యతరగతి, వేతన జీవులకు మాత్రం అందుబాటులోకి రాకపోవడంతో కొనుగోళ్లు కూడా ఊపందుకోవడం లేదు. ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు తగ్గే విషయంలో మాత్రం నిదానంగా నడుస్తున్నాయి. పెరిగే సమయంలో పరుగు.. తగ్గే సమయం నడకలా బంగారం, ధరల పరిస్థితి ఉంది. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతున్నప్పటికీ ధరల పెరుగుదలతో ఆశించినంత మేరకు విక్రయాలు జరగడం లేదని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. ధరలు ఇంకా తగ్గితనే కొనుగోళ్లు పెరుగుతాయంటున్నారు.
అందుబాటులోకి రాకపోవడంతో...
బంగారం అంటే అందరికీ ఇష్టమే. అలాగని అప్పులు చేసి కొనుగోలు చేసే పరిస్థితి ఎవరికి ఉండదు. తమ స్థోమతకు మించి బంగారాన్ని కొనుగోలు చేయడానికి కూడా ఎవరూ ఇష్టపడరు. ఈ ఏడాది బంగారం ప్రియులకు బ్యాడ్ టైం నడిచిందనే చెప్పాలి. ఈ ఏడాది ప్రారంభం నుంచి మొదలయిన ధరల పెరుగుదల మొన్నటి వరకూ కొనసాగింది. పది గ్రాముల బంగారం ధర దాదాపు లక్షన్నరకు చేరువకు చేరుకుని తిరిగి తగ్గుతుంది. అలాగే కిలో వెండి ధర రెండు లక్షల రూపాయలు దాటి తిరిగి తగ్గుతుంది. అయినా ఇంకా పూర్తి స్థాయిలో ధరలు తమకు అందుబాటులోకి రాలేదని వినియోగదారులు చెబుతున్నారు. అయితే ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో...
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ జోరుగా నడుస్తుంది. అలాగే శుభకార్యాలు కూడా నడుస్తున్నాయి. గృహప్రవేశాలతో పాటు వివిధ రకాలైన శుభకార్యాలు జరుగుతుండటంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల లేదు. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,12,740 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,22,990 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,65,900 రూపాయలకు చేరుకుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.