Gold Price Today : బంగారాన్ని వచ్చే ఏడాది అస్సలు కొనలేరట.. రీజన్ ఇదే

ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది

Update: 2025-11-24 03:29 GMT

బంగారం ధరలు మరింత పెరుగుతాయి. ఈ మాటలు ఎవరో అన్నది కాదు. ట్రేడ్ నిపుణులే. రాను రాను ధరలు మరింత ఎగబాకుతాయని, కొనుగోలు చేయాలనకున్న వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. అయితే బంగారం ధరలు ఒకరోజు పెరగడం, మరొక రోజు తగ్గడం అంటే.. అప్ అండ్ డౌన్ గా కొనసాతున్నాయి. భారీగా బంగారం ధరలు తగ్గింది లేదు. అలాగే ఇటీవల పది రోజుల్లో బంగారం ధర భారీగా పెరిగింది లేదు. అంటే పెరుగుదల అయినా.. తగ్గుదల అయినా నెమ్మదిగానే సాగుతుంది. ఈ నేపథ్యంలో రానున్న కొత్త ఏడాదికి బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు బులియన్ మార్కెట్ వర్గాల నుంచి బాగా వినిపిస్తున్నాయి.

ధరలు పెరగడం ప్రారంభిస్తే...
ఇక ధరలు పెరగడం ప్రారంభిస్తే బంగారం పది గ్రాములు లక్షన్నర రూపాయలకు చేరుకుంటుందని, కిలో వెండి ధర రెండు లక్షలకు మళ్లీ టచ్ చేస్తుందన్న ప్రచారం కూడా వాణిజ్య వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఎంత చెప్పినా తమకు అవసరమైన పరిస్థితుల్లోనే బంగారం, వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అవసరానికి మించి కొనుగోలు చేయడం ధరలను చూసి ఎప్పుడో మానేవారు. అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, డాలర్ రూపాయి భారీగా పతనం కావడంతో పాటు డాలర్ మరింత బడటం, దిగుమతులు తక్కువ కావడం వంటి కారణాలు కూడా బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గుదలకు కారణంగా చూడవచ్చని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో...
ఇక పెళ్లిళ్ల సీజన్ ఇంకా నడుస్తుండటంతో పాటు శుభకార్యాలు కూడా కొంత కాలం కొనసాగుతుండటంతో బంగారం, వెండికి డిమాండ్ తగ్గదని చెబుతున్నారు. అందువల్ల ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,15,340 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,25,830 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,71,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.



Tags:    

Similar News