Gold Rates Today : బంగారంపై వ్యామోహం ఉన్నవారికి గుడ్ న్యూస్.. నేటి ధరలు ఎంతో తెలుసా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. అనేక పరిస్థితులు బంగారం, వెండి ధరల్లో మార్పునకు కారణమవుతాయి. అయితే బంగారం మాత్రం ఇంకా కొనుగోలు చేసే వారికి అందుబాటులోకి రాలేదన్నది మాత్రం వాస్తవం. ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో తగ్గుతున్న సమయంలో స్వల్పంగానే ఉండటంతో ధరలు ఇంకా పూర్తిగా దిగిరాలేదు. పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు దాటేసి ఇప్పటికే నెల రోజులు పైగానే అవుతుంది. ఇంకా లక్ష పది వేల రూపాయలకు పైగానే ఉంది. వెండి ధరలు కూడా రెండు లక్షల రూపాయలు కిలో దాటిసి చివరకు ప్రస్తుతం లక్షన్నరకు దగ్గరగా ఉంది. ఇంకా తగ్గుతాయేమోనని చాలా మంది ఎదురు చూస్తున్నారు.
సెంటిమెంట్ కావడంతో...
బంగారం అంటే ఒక సెంటిమెంట్. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ముఖ్యంగా భారతదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ ప్రపంచంలో మరే దేశంలో ఉండదు. సంప్రదాయంగా వస్తున్న వాటిని నేటి తరం కూడా కొనసాగించడం, బంగారంపై వ్యామోహం ఈ జనరేషన్ లో తగ్గకపోవడంతో భారతదేశంలో బంగారం, వెండి వస్తువులకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. మిగిలిన దేశాల్లో మాదిరి ప్రత్యామ్నాయం వైపు చూసే వారు తక్కువ మంది కనిపిస్తారు. బంగారు ఆభరణాలతో తిరిగే వారి సంఖ్య ఇటీవల కాలంలో తగ్గినప్పటికీ కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. దీనికి కారణం బంగారం కొనుగోలు చేయడం అంటే..ముఖ్యంగా మహిళలకు అత్యంత ఇష్టమైన విషయం కావడంతో ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
స్వల్పంగా తగ్గి...
బంగారంపై పెట్టుబడి సురక్షితమని నమ్ముతారు. కానీ ప్రస్తుతం అలా లేదు. భారీగా పెరిగిన బంగారం ధర మళ్లీ పతనమవుతుందన్న ప్రచారం మధ్య పెట్టుబడి పెట్టే వారు కూడా బంగారం, వెండి కొనుగోలు విషయంలో ఆలోచనలో పడ్డారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర పై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,11,840 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,22,010 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,64,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు జరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.