Gold Rates Today : బంగారం, వెండి ధరలు మరింత తగ్గనున్నాయా? ఇదే కారణమా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి
బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. గత కొన్ని నెలల నుంచి గోల్డ్ రేట్స్ పెరుగుతూనే ఉన్నాయి. వెండి ధరలు కూడా ఎన్నడూ లేనంతగా ధరలు మండిపోతున్నాయి. ధరలు ఇంకా పెరుగుతాయన్న అంచనాలు వినపడుతున్నాయి. ఇప్పటి వరకూ థన్ తెరాస్ తో పాటు దీపావళి పండగ కూడా ఉండటంతో కొంత మేరకు అమ్మకాలు జరిగాయి. అయితే నేటితో అవి కూడా పూర్తి కావడంతో కొనుగోళ్లపై ప్రభావం ఉంటుందని వ్యాపారులు భావిస్తున్నారు. అయితే పెళ్లిళ్ల సీజన్ ఇంకా ముగియకపోవడంతో కొనుగోళ్లు కొంత మేరకు కొనసాగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అయితే ధరలు కొంత మేరకు దిగి రావచ్చన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.
అందరికీ ఇష్టమైన...
బంగారం అంటే అందరికీ ప్రియమే. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి విషయంలో ధరలు పెరిగినా కొనేవారు కొంటూనే ఉంటున్నారు. బంగారం భవిష్యత్ కు అవసరమని గుర్తించారు. బంగారం ఉంటే దిగులుండదన్న భావన పెరిగింది. దీంతో పెట్టుబడి దారులు కూడా ఎక్కువగా బంగారం, వెండి పై పెట్టుబడులు పెడుతున్నారు. డాలర్ బలహీనపడటంతో కొంత మేరకు బంగారం ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న కాలంలో మరింతగా ధరలు తగ్గే అవకాశముందని కూడా అంటున్నారు. ఇదే సమయంలో పెట్టుబడులు పెట్టే వారు మాత్రం ఇతర మార్గాల కంటే బంగారం, వెండి పెట్టుబడి సురక్షితమని నమ్ముతున్నారు.
స్వల్పంగా తగ్గి...
పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం, వెండి వస్తువుల కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారం వెండి వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదమని నమ్ముతారు. అందుకే బంగారం విషయంలో మాత్రం ఆలోచించే పరిస్థితి ఉండదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,19,790 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,30,680 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,89,900 రూపాయలకు చేరుకుంది.