Gold Rates Today : బంగారం కొనేవారికి సూపర్ న్యూస్.. ఇంత ధరలు ఎప్పుడైనా తగ్గాయా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2025-11-15 03:17 GMT

బంగారం ధరలు మరింత పెరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే తగ్గితే కొంత పెరిగితే.. అంత అన్నట్లుగా బంగారం, వెండి ధరల్లో మార్పు ఉంటుంది. ధరలు తగ్గితే పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గుతుంది. కిలో వెండి ధర పై వంద రూపాయలు తగ్గుతుంది. కానీ అదే ధరలు పెరిగితే వందలు.. వేల రూపాయల్లో పెరుగుదల ఉంటుంది. ధరల పెరుగుదల విషయంలో వినియోగదారులకు ఒక క్లారిటీ ఉంది. అయితే ఇప్పటికీ బంగారం, వెండి ధరలు అందుబాటులోకి రాలేదు. కొనుగోలు చేయాలంటే కొంత మేరకు ధరలు దిగి వస్తాయమేనని చాలా మంది భావిస్తున్నప్పటికీ ధరలు పెద్దగా తగ్గడం లేదు. అదే సమయంలో మరింతగా పెరిగి ఆందోళనకు గురి చేస్తున్నాయి.

కొనుగోలు చేయాలనుకున్నవారు...
బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారు కూడా ఇంకా వేచి చూసే ధోరణిని మాత్రమే వ్యవహరిస్తున్నారు. ధరలు తాము ఆశించినంత మేరకు తగ్గడం లేదన్నది వినియోగదారుల అభిప్రాయం. అలాగని కొనుగోలు చేయకుండా ఉండలేని పరిస్థితి. బంగారం, వెండి ధరల్లో మార్పునకు అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ అదనపు సుంకాలు, ట్రంప్ నిర్ణయాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో మొదలయిన బంగారం, వెండి ధరల పెరుగుదల ఇంత వరకూ ఆగడం లేదు. మధ్యలో కొంత తగ్గినట్లు కనిపిస్తున్నా స్వల్పంగానే కనిపిస్తుంది.
కొద్దిగా తగ్గి...
పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆ మాత్రం కొనుగోళ్లయినా జరుగుతున్నాయి. ఇక పెట్టుబడిదారులు కూడా ధరలు తగ్గితే కొనుగోలు చేయాలని వేచి చూస్తున్నారు. భారతదేశంలో బంగారం, వెండి వస్తువులకు డిమాండ్ తగ్గకపోవడానికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం కావడమే. ఈరోజు దేశంలో బంగారం ధరలుతగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,16,440 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,27,030 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,83,200 రూపాయలుగా కొనసాగుతుంది. మధ్యాహ్నానికి వీటి ధరల్లో మార్పులుండవచ్చు.
Tags:    

Similar News