Gold Price Today : బంగారం ధరలు భారీగా పడతాయా? నిపుణులు ఏమంటున్నారు?
ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముంది. గత కొద్ది రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలు ఏ మాత్రం తగ్గేటట్లు కనిపించడం లేదు. అయితే బంగారం ధరలు మరింతగా పతనమవుతాయన్న మార్కెట్ నిపుణుల అంచనాలు కూడా నిజం కావడం లేదు. ఇంకా ధరలు మరింత పెరిగే అవకాశముందని మరొకవైపు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు ఇప్పుడు ఎవరికీ అందుబాటులో మాత్రం లేవు. కొందరికి మాత్రమే కొనుగోలుకు అనుకూలంగా ఉన్నాయి. అత్యధిక సంఖ్య ప్రజలకు మాత్రం బంగారం దూరమయిందనే చెప్పాలి. ఇప్పటి వరకూ ఇలా ఎన్నడూ పెరగలేదని, రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరుగుతుండటంతో ధరలు అదే స్థాయిలో పతనతమవుతాయన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.
అనేక కారణాలతో...
దేశంలో బంగారం దిగుమతులు తక్కువగా ఉండటం కూడా బంగారం ధరలు పెరగడానికి కారణంగా చెప్పాలంటున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి విలువ క్షీణించడం, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న అదనపు సుంకాలు, అమెరికా షట్ డౌన్ వంటి వాటి కారణంగా ధరలు పెరుగుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో వేల రూపాయలు బంగారం ధరలు పెరగడానికి అదే కారణమని అంటున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రారంభమైన పసిడి పరుగు మాత్రం ఆగలేదు. వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం, వెండి వస్తువుల కొనుగోలు కష్టంగా మారింది.
నేటి ధరలు...
పెళ్లిళ్ల సీజన్, పండగలు ఉన్నప్పటికీ బంగారం, వెండి అమ్మకాలు మాత్రం ఊపందుకోక పోవడానికి ప్రధాన కారణం ధరల పెరుగుదల అని చెబుతున్నారు. పెట్టుబడి దారులు కూడా బంగారం కొనుగోలుకు ముందుకు రావడం లేదు. ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,13,610 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,23,940 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,70,010 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.