Gold Rates Today : బంగారం ధరలు ఇక ఏ రేంజ్ లో ధరలు పెరుగుతాయో తెలుసా?
ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి
బంగారం బరువుగా మారుతుంది. రోజురోజుకూ బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది బంగారం, వెండి ధరలు వినియోగదారులకు చుక్కలు చూపుతున్నాయి. పసిడి కొనుగోలు చేయడం ఇప్పుడు సాధారణ, మధ్యతరగతి ప్రజలకు అసాధ్యంగా మారింది. అదే సమయంలో పసిడిని కొనుగోలు చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. అనేక కారణాలతో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏరోజూ తగ్గడం లేదు. ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి. బంగారం ధరలు ఇప్పటికే పది గ్రాములు లక్షన్నరకు చేరువలో ఉన్నాయి. ఇంకా ఈ పసిడి పరుగు ఎంత దూరం వెళుతుందన్నది మాత్రం ఎవరికీ అర్థం కాకుండా ఉంది.
ధరలు పెరగడానికి...
బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ కూడా బంగారం పెరుగుదలకు ఒక కారణంగా చెబుతున్నారు. దీంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అదనపు సుంకాల మోత, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి విలువ క్షీణించడంతో పాటు దిగుమతులు తగ్గడం వంటివి కూడా బంగారం ధరలు పెరగడానికి గల కారణాలుగా చెబుతున్నారు. మరొకవైపు డిమాండ్ తో సంబంధం లేకుండా ధరలు పెరిగేది ఒక్క బంగారం విషయంలోనే. అసలు బంగారానికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉండటం వల్లనే ఈ రేంజ్ లో ధరలు పెరిగి షాక్ లు మీద షాక్ లు ఇస్తున్నాయంటున్నారు.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో...
మరొకవైపు పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కూడా నడుస్తుండటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు కట్నం కంటే బంగారం పెట్టుబడి పెట్టాలంటూ వరుడి తరుపున వారు కోరుకుంటుండటం ధరల ప్రభావమేనని చెప్పాలి. ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు నమోదయిన హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,11,860 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,22,030 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,66,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.