Gold Price Today : కొంత తగ్గాయ్ కానీ.. ఇంకా అందుబాటులోకి రాలేదుగా

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2025-11-20 04:07 GMT

బంగారం ధరలు మరింత పెరగనున్నాయి. ఎంతగా పెరుగుతాయన్నది ఇప్పటి వరకూ అంచనా లేకపోయినా పెరగడం మాత్రం గ్యారంటీ అని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు. బంగారం, వెండి ధరలు ఎంతగా పెరుగుతున్నాయంటే గతంలో ఎన్నడూ లేని విధంగా పైపేకి ఎగబాకుతున్నాయి. ఈ రేంజ్ లో ఎన్నడూ ధరలు పెరగలేదన్నది మాత్రం వాస్తవం. నిజానికి ఇంతగా ధరలు పెరుగుతాయని ఎవరూ అంచనా వేయలేదు. అందుకే పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్నా ముందుగా కొనే పరిస్థితి కనిపించ లేదు. ఇక ఈ ఏడాది ఆరంభం నుంచి ధరల పెరుగుదల ప్రారంభమై అప్పడప్పుడు తగ్గుతున్నప్పటికీ ధరలు మాత్రం ఇంకా వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు.

ధరల పెరుగుదలకు...
ధరల పెరుగుదలకు అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, అదనపు సుంకాలు వంటి విషయాలు బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరుగడంతో దాని ప్రభావం కొనుగోళ్లపై పడుతుంది. పెట్టుబడి దారులు కూడా సురక్షిత ఆస్తుల వైపునకు మొగ్గు చూపుతున్నాయి. అనేక మంది బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపినా ఇందుకు సంబంధించిన ధరలు భయపెడుతుండటంతో వారు కూడా ఆసక్తి చూపడం లేదు.
స్వల్పంగా పెరిగి...
పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతుండటంతో ధరలు మరింత పెరుగుతాయన్నది వాస్తవం. ఇంకా ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చేసిన హెచ్చరికలతో ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చని భావిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,14,460 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,24, 870 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,76,100 రూపాయలుకు చేరుకుంది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పు చోటు చేసుకునే అవకాశముంది.


Tags:    

Similar News