Gold Prices Today : బంగారంనేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. కొనుగోలుకు ఇదే మంచి సమయం

ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి

Update: 2025-04-26 03:37 GMT

బంగారం ధరలు చేతికి చిక్కడం లేదు. అందుబాటులో ఉండకుండా అందకుండా పోయాయి. ఇప్పటికే తులం బంగారం కొనుగోలు చేయాలంటే భారంగా మారింది. అదే సమయంలో వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతుండటంతో ఇక ఈ రెండు వస్తువులు అపురూపంగా మారే రోజులు కొద్ది రోజుల్లోనే కనిపించనున్నాయన్న అంచనాలు వినపడుతున్నాయి. మొన్నా మధ్య తులం బంగారం లక్ష దాటేసింది. దీంతో బంగారు వ్యాపారుల నుంచి మదుపరుల వరకూ అందరూ కంగారుపడిపోయారు. దీనివల్ల అమ్మకాలు మరింత తగ్గుతాయని భావించారు. అనుకున్నట్లుగానే బంగారం, వెండి అమ్మకాలు గత సీజన్ తో పోలిస్తే దాదాపు అరవై శాతం పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.

పెళ్లిళ్ల సీజన్ కావడంతో...
మరొకవైపు బంగారాన్ని కొనుగోలు చేయాల్సిన వారు కొందరే ఉన్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో మంగళసూత్రానికి బంగారంతో చేయించాల్సి రావడంతో తక్కువలో తక్కువగా చేయించుకుంటూ బంగారంపై సొమ్మును వెచ్చించడానికి ఎవరూ సిద్ధపడటం లేదు. అలాగని ఇతర దేశాల నుంచి బంగారం దిగుమతులు జరగడం లేదా? అంటే అదీ లేదు. దిగుమతులు బాగానే ఉన్నాయి. కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు పుణ్యమా అని బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక చైనా, అమెరికా ట్రేడ్ వార్ ప్రభావం కూడా బంగారం, వెండి ధరలపై పడిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధరలు ఎంత తగ్గినా ఒక్కసారి పెరిగితే ఇక కొనుగోలు చేయడం కష్టమేనన్న అభిప్రాయానికి వినియోగదారులు వచ్చేశారు.
నిలకడగా ధరలు...
బంగారం, వెండి ఇప్పుడు ప్లాటినం ధరలకు మించి పోయాయి. దీంతో ఎక్కువ మంది పెళ్లిళ్లు, పేరింటాలకు గిల్టు నగలతో కనిపిస్తూ వస్తున్నారు. అంతే తప్ప బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ సాహసించడం లేదు. అంత ధర పెట్టి కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో బేరాల కోసం జ్యుయలరీ దుకాణాల యజమానులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,040 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,230 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,10,800 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News