Gold Price Today : తగ్గాయని సంబర పడినంత సేపు లేదుగా.. భారీగా బంగారం షాకిచ్చిందిగా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2025-11-01 03:40 GMT

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు మళ్లీ పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తుంది. ధరలు తగ్గుతాయని భావించి బంగారం కొనుగోలు కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు. ధరలు తగ్గితే బంగారాన్ని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా వారి ఆశలపై నీరు చల్లినట్లుగా ధరలు పెరుగుతున్నాయి. బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ తమకు అందుబాటులోకి వస్తే కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ధరలు తగ్గాయని సంబరపడే లోపు ధరలు మళ్లీ పెరగడం ప్రారంభం కావడంతో వినియోగదారులు కూడా ఆలోచనలో పడ్డారు. ధరలు భారీగా పతనమవుతాయని అనేక అంచనాలు వినిపించిన నేపథ్యంలోనే వేచి చూస్తున్నారు.

పెట్టుబడి పెట్టిన వారు...
అయితే పెట్టుబడి పెట్టిన వారు ధరలు కొంత పెరగడంతో బంగారాన్ని విక్రయించేందుకు సిద్ధపడుతున్నారు. కొద్దిపాటి నష్టానికైనా బంగారాన్ని విక్రయించడం మేలన్న భావన వారిలో కనపడుతుంది. గతంలో బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని, వెండి ధరలు రెండు లక్షలు దాటేసినా కొనుగోలు చేసిన వారు ఇప్పుడు కొంత పెరగడంతో వాటిని విక్రయించేందుకు వస్తున్నారని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. అలాగే పాత బంగారానికి విలువ ఎక్కువ అని, వారికి ప్రత్యేకంగా ఆఫర్లు కూడా బంగారు దుకాణాల యజమానులు ప్రకటిస్తున్నారు. మరొకవైపు కొత్తగా కొనుగోలు చేసేవారు సయితం బంగారం ధరలు మళ్లీ పెరగడంతో నిరాశకు గురయ్యారు.
నేటి ధరలు...
పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు నిజమయ్యేటట్లు కనిపిస్తున్నాయి. కొనుగోళ్లు కూడా గతంలో కంటే కొంత ఎక్కువగా పెరిగినట్లు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై వెయ్యి రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,13,010 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,23,290 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,64,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పు జరిగే అవకాశముంది.


Tags:    

Similar News