Gold Price Today : షాకింగ్ న్యూస్ ...మళ్లీ పెరిగిన బంగారం ధరలు... ఈరోజు భారీగానే
బంగారం ధరలు మరింత పెరిగాయి. నిన్న తగ్గడంతో ఒకింత సంతోషంతో ఉన్న వినియోగదారులకు షాకింగ్ న్యూస్.
gold rates today in hyderabad
బంగారం ధరలు మరింత పెరిగాయి. నిన్న తగ్గడంతో ఒకింత సంతోషంతో ఉన్న వినియోగదారులకు షాకింగ్ న్యూస్. ఈరోజు ఉదయం బంగారం ధరల్లో భారీ పెరుగుదల కనిపించింది. వెండి ధరలు కూడా అమాంతం పెరిగాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలతో అమ్మకాలు ఊపందుకుంటాయని వ్యాపారులు భావించారు. అదే సమయంలో కొనుగోళ్లు కూడా ఎక్కువగా జరుగుతాయని, పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో మరింత గిరాకీ పెరుగుతందని భావించారు. అయితే ఈరోజు మధ్యాహ్నానికి ధరల్లో భారీ మార్పు కనిపించింది.
భారీగా పెరిగిన...
ఈరోజు బంగారం ధరలు మరింత పెరిగాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై 850 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై 910 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,850 రూపాయలకు చేరుకుంది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,470 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధరపై వెయ్యి రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర ప్రస్తుతం బులియన్ మార్కెట్ లో 1,03,000 రూపాయలకు చేరుకుంది.