Gold Price Today : గుడ్ న్యూస్... గంతులేయడమే.. గోల్డ్ రేట్స్ పడిపోయాయ్

బంగారం ధరలు ఎక్కువ సార్లు పెరుగుతుంటాయి. తక్కువ సార్లు మాత్రమే తగ్గుదల కనిపిస్తుంది

Update: 2025-01-20 03:10 GMT

బంగారానికి ఎప్పుడూ గిరాకీ తగ్గదు. వెండి కూడా అంతే. ధరలు ఎంత పెరుగుతున్నప్పటికీ కొనుగోలు చేసే వారి సంఖ్య మాత్రం తగ్గకపోవడంతో ధరలు పెరుగుతూనే పోతున్నాయి. ఇటీవల కాలంలో గత పది రోజుల్లోనే బంగారం ధరలు దాదాపు రెండు వేల వరకూ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. కిలో వెండి ధరపై నాలుగు వేల రూపాయల వరకూ పెరిగిందని అంటున్నారు. పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రూపాయలకు చేరుకోగా, కిలో వెండి ధర లక్ష రూపాయలు దాటి ఇంకా పరుగులు పెడుతూనే ఉంది. అయితే నేడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశముందన్న హెచ్చరికలను కూడా మార్కెట్ నిపుణులు చేస్తున్నారు.

అవసరార్ధం కాకపోయినా...
బంగారం, వెండి నిత్యావసర వస్తువులు కాదు. కేవలం అవసరార్థం కొనుగోలు చేసేవే. కానీ ఇప్పుడు అవసరమున్నా లేకపోయినా బంగారం, వెండి కొనుగోలుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అందుకు ప్రధాన కారణం బంగారం పై పెట్టుబడి సురక్షితమేనని భావించడమే. దీంతో పాటు సమాజంలో గౌరవం మనకు పుష్కలంగా లభించాలంటే పసిడి మన దగ్గర ఉండాలన్న భావన ఎక్కువ మందికి కలుగుతుండటంతో ఎంత ధరపోసైనా బంగారాన్ని, వెండిని కొనుగోలు చేసి సొంతం చేసుకుంటున్నారు. గత ఏడాదికి ఈ ఏడాదికి ధరల్లో చాలా మార్పు వచ్చింది. పది గ్రాముల బంగారం ధరపై ఐదు వేల నుంచి పది వేల రూపాయల వరకూ తేడా చూపించడంతో లాభం వస్తుందని గంతులేస్తూ మరీ కొనుగోలు చేస్తున్నారు.
ధరలు తగ్గి...
బంగారం ధరలు ఎక్కువ సార్లు పెరుగుతుంటాయి. తక్కువ సార్లు మాత్రమే తగ్గుదల కనిపిస్తుంది. అయినా సరే బంగారాన్నికొనుగోలు చేయకుండా మాత్రం ఎవరూ ఆగడం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయల తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,340 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 81,100 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,03,900 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News