Gold Price Today : మహిళలకు తీపికబురు.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో మాత్రం తగ్గుదల కనిపించింది.
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. అలాగని తగ్గుతాయని కూడా అంచనా వేయలేం. ఇలా ఎప్పటికప్పుడు ధరల్లో మార్పులు సామాన్యులకు పసిడి అందకుండా పోతుంది. ఇంటి అవసరాల కోసం కొనుగోలు చేసే బంగారం విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తుంది. తులం బంగారం కొనాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పులు చేసి అవసరాలు తీర్చే కన్నా బంగారం కొనుగోలు చేయకపోవడమే మంచిదన్న భావనలో ఎక్కువ మంది ఉండిపోతున్నారు. అయితే సంప్రదాయాలను తోసిపుచ్చలేక, పెళ్లిళ్ల విషయంలో కొందరు తప్పనిసరిపరిస్థితుల్లో అప్పులు చేసి మరీ బంగారం, వెండి కొనుగోలు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువయింది.
దూసుకుపోతున్న ధరలతో...
బంగారం ధరలు కేవలం భారత్ లోనే కాదు.. ప్రపంచంలోనూ దూసుకుపోతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో ఒకింత తగ్గినట్లు కనిపించినా మళ్లీ తారాజువ్వలా బంగారం ధరలు దూసుకెళుతున్నాయి. అయినా కొనుగోలు చేయక తప్పని సరి పరిస్థితుల్లో వాటిని సొంతం చేసుకుంటున్నారు. అయితే గతంలో మాదిరిగా తమ వ్యక్తిగత అవసరాల కోసం బంగారం, వెండి కొనుగోలు చేయడం మాత్రం చాలా వరకూ మానుకున్నారు. ఇంత ధరలు పోసి కొనుగోలు చేయడం అవసరమా? అన్న ధోరణి ఎక్కువ మందిలో కనపడుతుంది. పసిడి, వెండిలను స్టేటస్ సింబల్ గా చూడటం వల్లనే ఇంత భారీ స్థాయిలో ధరలు పెరిగాయని చెప్పాలి.
తగ్గిన వెండి ధరలు...
బంగారం లోహమే అయినా.. దానికి ఉన్న ప్రాముఖ్యత ఈ కాలంలో మరే వస్తువుకు లేదు. భూమికి ఉన్నంత విలువ బంగారానికి ఏర్పడింది. గతంలో మాదిరిగా ఎవరూ మెడలో బంగారు ఆభరణాలు లేకుండా ఉండేందుకు ఇష్టపడకపోవడమే ధరలు మరింత పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు. దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో మాత్రం తగ్గుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరలు 71,300 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,780 రూపాయలుగా కొనసాగుతుంంది. కిలో వెండి ధర వందరూపాయలు తగ్గి 99,900 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.