Gold Price Today : వేసవిలో ఉష్ణోగ్రతలకు పోటీగా పెరుగుతున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి
వేసవిలో ఉష్ణోగ్రతలు ఎంతగా పెరుగుతాయో... అలాగే బంగారం ధరలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. సమ్మర్ లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం నేచర్ గా జరిగే విషయం. కానీ బంగారం విషయంలో ఏ మాయ జరుగుతుందో తెలియదు కానీ ధరలు మాత్రం పైపైకి పోతూనే ఉన్నాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నా అవి కొనుగోలుదారులకు పట్టవు. తమకు అందుబాటులో ఉన్నాయా? లేదా? అన్నది మాత్రమే చూస్తారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, బంగారం నిల్వలు వంటి కారణాలతో ధరల పెరుగుదలకు కారణమవుతుంది.
ఎన్ని చర్యలు తీసుకున్నా...
అలాగే ఇక సీజన్ లో అయితే చెప్పాల్సిన పనిలేదు. మనకు దిగుమతి చేసుకోవాల్సిన బంగారం నిల్వలు సక్రమంగా రాకపోవడంతో ధరలు పెరిగాయన్న కారణం కూడా సహేతుకమే అయినా.. కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ కనకం కనికరించడం లేదు. రోజురోజుకూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ మరో నాలుగు ఐదు నెలలున్నప్పటికీ అమ్మకాలు జరుగుతాయన్న నమ్మకం వ్యాపారుల్లో కలగడం లేదు. ఎందుకంటే ఈ సీజన్ ప్రారంభం నుంచే కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వినియోగదారులు బంగారం కొనుగోలుకు విముఖత చూపుతుండటంతో వ్యాపారులు వ్యాపారాలు లేక గోళ్లు గిల్లుగింటున్నారు.
ధరలు పెరిగి...
ముందు జీవనానికి అవసరమైన డబ్బులు అవసరం. తర్వాతే బంగారం, వెండి అయినా. ధరలు అందుబాటులో ఉంటే సరే. కానీ అవి అల్లంత దూరంలో ఉన్నప్పుడు వాటిని కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు వస్తారని వ్యాపారులే ప్రశ్నిస్తున్నారు. అందుకే ధరలు పెరగిన నాటి నుంచి బంగారం, వెండి ధరల కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటల వరకూ నమోదయిన ధరలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నానికి ఇవి మారవచ్చు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,660 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,990 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,04,900 రూపాయలుగా నమోదయింది.