Gold Price Today : మరోసారి షాకిచ్చిన బంగారం ధరలు.. ఇక పరుగు ఆపేట్లు లేవుగా

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది

Update: 2025-06-19 03:55 GMT

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియదు. తగ్గేది అనేది జరగదు. బంగారం ధరలు మరింత భారంగా మారిపోతున్నాయి. వినియోగదారులను నిరాశపరుస్తున్నాయి. బంగారం ధరలు దాదాపుగా పెరుగుతూనే ఉంటాయి. ఇటీవల కాలంలో ధరలు పెరగడం అనేది వారంలో ఆరురోజులపాటు జరుగుతుంది. అయితే బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అనేక కారణాలతో బంగారం ధరలు నేటి కంటే మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. అంతర్జాతీయంగా తలెత్తిన పరిణామాలు, ఇజ్రాయిల్ - ఇరాన్ ల మధ్య యుద్ధం కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణమని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

ఏడాది ఆరంభం నుంచే...
ఈ ఏడాది ఆరంభం నుంచే బంగారం ధరలు పెరుగుతున్నాయి. అప్పుడు ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం లేకపోయినప్పటికీ ధరలు పెరిగాయని కొందరు గుర్తు చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే బంగారం ధరలు పతాక స్థాయికి చేరుకున్నాయని అంటున్నారు. బంగారం ధరలు ఇప్పటికే పది గ్రాములు లక్ష రూపాయలు దాటేశాయి. వెండి ధరలు లక్ష ఇరవై వేల రూపాయలను మించిపోయింది. ఇలా ధరలు పెరుగుతండటంతో అమ్మకాలు తగ్గడంతో జ్యుయలరీ దుకాణాలు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తరుగులోనూ, పాత రేట్లకే బంగారం ధరలు విక్రయిస్తామని చెబతుున్నప్పటికీ కొనుగోలుకు ముందుకు రావడం లేదు.
స్వల్పంగా పెరిగి...
ఇక పెట్టుబడిగా చూసేవారు కూడా వెనక్కు తగ్గుతున్నారు. బంగారంపై పెట్టుబడి సురక్షితం కాదని వారు భావించి ఇప్పట్లో కొనుగోలు చేయడం మంచిది కాదని నమ్ముతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన ధరలు మధ్యాహ్నానికి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,500 రూపాయలకుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,00,920 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,21,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Tags:    

Similar News