Gold Rates Today : ఫ్రైడే షాకిచ్చిన గోల్డ్ రేట్స్.. ఎంత పెరిగాయో తెలిస్తే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది

Update: 2025-02-14 03:34 GMT

బంగారం ధరలు పెరుగుతాయని అందరూ ఊహించినదే. ఎండలతో పాటు బంగారం ధరలు కూడా మండిపోతున్నాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇది వినియోగదారులను కలవరపరుస్తున్నాయి. పెట్టుబడి పెట్టే వాళ్లు సయితం బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. అయితే ధరలు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాపారులు కూడా ఇలాగే ధరలు పెరిగితే వ్యాపారం సజావుగా నడవదని భావిస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో అనేక రకాలైన ఆభరణాలను తయారు చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఆఫర్లు ఇస్తున్నా...
మరోవైపు ఆఫర్లు కూడా భారీగానే ప్రకటిస్తున్నాయి. తరుగుపై కొంత డిస్కౌంట్ తో పాటు పాత బంగారం ఇస్తే మార్పిడిపై కొంత మొత్తాన్ని ఇస్తామంటూ వినియోగదారులను తమ దుకాణాలకు రప్పించుకునేందుకు తంటాలు పడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయి పది రోజులు గడిచినా మాఘమాసంలో పెళ్లిసందడిలో బంగారం కొనుగోళ్లు పెద్దగా కనిపించడం లేదు. గత సీజన్ తో పోలిస్తే కొనుగోళ్లు దాదాపు ముప్ఫయి శాతం తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరుగుదలకు అనేక కారణాలున్నప్పటికీ తులం బంగారం కొనుగోలు చేయాలంటే సాధ్యం కాని పని అని భావిస్తున్నారు. బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి.
ధరలు పెరగడంతో...
బంగారం అంటే అదొక క్రేజ్. స్టేటస్ సింబల్ గా భావిస్తూ కొనుగోలు చేసేవారు సయితం ఇప్పుడు ధరలు చూసి బెదిరిపోతున్నారు. అవసరానికి మించి కొనుగోలు చేసే వారు సయితం వెనుకంజ వేస్తుండటంతో పాటు సీజన్ లోనూ వ్యాపారాలు పెద్దగా జరగడం లేదని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,810 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,060 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 1,06,900 రూపాయలుగా నమోదయింది.




Tags:    

Similar News