Gold Price Today : బంగారం ధరలు ఇలా షాకిస్తున్నాయేంటో.. ఇక కొనుగోలు చేయడం కష్టమేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది
బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారు ఇక ఆలోచన మానుకోవాల్సిందే. బంగారం అంటే అందరికీ మక్కువ ఉంటుంది. అత్యంత ఇష్టపడేది బంగారం. ముఖ్యంగా మహిళలు చీరల తర్వాత బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. బంగారం విషయంలో మహిళలు రాజీ పడరు. ఎందుకంటే బంగారం ఎంత ఉంటే అంత శుభప్రదమని సెంటిమెంట్ గా కూడా భావిస్తారు. సంస్కృతి సంప్రదాయాల ప్రకారం బంగారం విషయంలో మహిళలు మొన్నటి వరకూ ఎవరినీ లెక్క చేయరు. కానీ నేడు పెరిగిన ధరలను చూసి మహిళలే వెనక్కు తగ్గుతున్నారు. బంగారాన్ని లక్షలు పోసి కొనుగోలు చేయడం అవసరమా? అన్న ఆలోచన వారిని కొనుగోలుకు దూరం చేసిందనే చెప్పాలి.
కొనుగోలు చేయాలంటే...
బంగారం ధరలు ఈ ఏడాది ప్రారంభం నుంచి పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఎంత పేద కుటుంబం అయినా కొద్దిగానైనా బంగారం ఉంటుంది. అలాంటి ఇప్పుడు బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. తులం బంగారం కొనుగోలు చేయాలంటే లక్షా 17వేలకుపైగా పెట్టుకోవాల్సిందే. బంగారం అంటేనే మహిళలు భయపడిపోతున్నారు.రోజురోజుకు బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటాం. పండగలు, ఇతర శుభ కార్యలకు బంగారం తప్పకుండా కొనాల్సిందే. దేశంలో ఎంత పేద కుటుంబం అయినా కొద్దిగానైనా బంగారం ఉంటుంది. కానీ పెరుగుతున్న బంగారం ధరలు చూసి దానిపై మక్కువ పెంచుకోవడం మానేశారు.
భారీగా పెరిగి...
ఇక పెట్టుబడిగా చూసేవారు సయితం బంగారం విషయంలో భయపడిపోతున్నారు. ఇంతగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోతే తమకు నష్టం వాటిల్లు తుందని భయపడి కొనుగోలుకు దూరంగా జరుగుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై వెయ్యి రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,07,660 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,17,450 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,61,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.