Gold Price Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. నేడు బంగారం ధరలు పెరగలేదు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.
బంగారం కొనాలంటేనే భయమేస్తుంది. గతంలో మాదిరిగా బంగారం ధరలు అందుబాటులో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. బంగారం భారతీయులకు ఒక సెంటిమెంట్. ఒక స్టేటస్ సింబల్. ప్రధానంగా దక్షిణ భారత దేశంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. కేవలం ఆభరణాలను మాత్రమే కాకుండా పెట్టుబడిగా చూసే వారు కూడా బంగారం విషయంలో ఇటీవల పెరిగారు. గత కొన్నేళ్ల నుంచి బంగారం ధరలు పెరుగుతుండటంతో పెట్టుబడి సురక్షితమని అందరూ భావించారు. అందుకోసమే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. అయితే గత కొద్దిరోజులుగా అంటే ఏడాది కాలం నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉండటంతో కొనుగోలు చేయడానికి కూడా వెనుకంజ వేస్తున్నారు.
పెట్టుబడి పెట్టేవారు...
ఇంతగా పెరిగిన బంగారం ధరలు మళ్లీ పతనమయితే ఎలా? పెట్టుబడి పెట్టే వారు సయితం ఆలోచనలో పడిపోయారు. అందుకే వారు కూడా కొనుగోలుకు దూరంగా ఉన్నారు. దీంతో గత కొద్ది నెలల నుంచి బంగారం, వెండి కొనుగోలు చేసే వారు తక్కువయ్యారు. ధరలు పెరగడంతోనే అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం కూడా చెబుతుంది. అయితే గత కొద్ది రోజులుగా ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. అయితే ఇంకా ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసేటేతంత మాత్రం అందుబాటులోకి రాలేదు. అందులోనూ పెళ్లిళ్ల సీజన్ జోరుగా నడుస్తుడటం వల్లనే ఆ మాత్రం అమ్మకాలు అయినా జరుపుతున్నామని, లేకుంటే ఈగలు తోలుకోవాల్సిందేనని మదన పడుతున్నారు.
నేటి ధరలివీ...
ఎక్కువ మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అందులో మహిళలు ఎక్కువగా చూపే బంగారం ధరలు భారీగా పెరిగి క్రమంగా దిగి వస్తున్నాయి. కానీ ఇంకా అందుబాటులోకి రావాలని మహిళలు ఆకాంక్షిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,890 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,340 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,26,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.